News April 29, 2024

50 ఏళ్లకే బీసీలకు వృద్ధాప్య పింఛను: చంద్రబాబు

image

AP: వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే వ్యాపారస్థులు కప్పం కట్టే దుస్థితి ఏర్పడుతుందని చంద్రబాబు విమర్శించారు. ‘జగన్ గత ఎన్నికల్లో కోడికత్తి, ఇప్పుడు గులకరాయి డ్రామా ఆడుతున్నారు. వివేకాను ఎవరు చంపారు? రాయలసీమకు ఏమీ చేయని YCP నేతలకు ఎందుకు ఓట్లు వేయాలి? మా ప్రభుత్వం వచ్చాక 50 ఏళ్లకే BCలకు వృద్ధాప్య పింఛను ఇస్తాం. BC, SC, STలను ఆర్థికంగా పైకి తీసుకొస్తా. ముస్లింలకు అన్యాయం జరగనివ్వను’ అని చెప్పారు.

Similar News

News November 5, 2024

గ్రాడ్యుయేట్లకు అలర్ట్.. రేపే లాస్ట్ డేట్

image

TG: కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ స్థానాల ఓటర్ నమోదు గడువు రేపటితో ముగియనుంది. 2019తో (1.96లక్షలు) పోల్చితే ప్రస్తుతం ఓటరు దరఖాస్తుల సంఖ్య(2.40 లక్షలు) పెరిగింది. అయినా ఇంకా సగం మంది గ్రాడ్యుయేట్లు ఓటు నమోదుకు దూరంగా ఉన్నట్లు సమాచారం. ఈనెల 23న డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్, అభ్యంతరాల స్వీకరణ తర్వాత డిసెంబర్ 30న ఫైనల్ లిస్ట్‌ను రిలీజ్ చేస్తామని అధికారులు తెలిపారు.

News November 5, 2024

అమెరికాలో అత్యధిక ఓటింగ్ శాతం ఎంతంటే?

image

1876లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో US చరిత్రలోనే అత్యధిక ఓటింగ్ శాతం నమోదైంది. ఆ ఎలక్షన్లలో ఏకంగా 81.8 శాతం మంది అమెరికన్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక 1792 ఎలక్షన్స్‌లో కేవలం 6.3 శాతం మందే ఓట్లు వేశారు. ఇదే అమెరికా చరిత్రలో అత్యల్ప ఓటింగ్ శాతం. గత ఎన్నికల్లో దాదాపు 66 శాతం ఓటింగ్ నమోదు కాగా ఈ సారి అది పెరుగుతుందని అంచనా.

News November 5, 2024

₹4000+Cr ప్రాఫిట్: 4 ఏళ్లలో తీసుకుంది ఐదుగురినే!

image

Zerodha టెక్ టీమ్ గత 4 ఏళ్లలో కొత్తగా ఐదుగురినే తీసుకుంది. టీమ్‌సైజ్ 35 మాత్రమే కావడం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ₹4000 కోట్లకు పైగా ప్రాఫిట్ ఆర్జిస్తున్న ఈ కంపెనీ ఎక్కువగా AIపై ఆధారపడుతోందని తెలుస్తోంది. ఆర్డర్స్, ట్రాన్జాక్షన్స్ సహా చాలా పనుల్లో హ్యూమన్ ఇంటర్‌ఫియరెన్స్ తక్కువేనన్న విశ్లేషణలు వస్తున్నాయి. ఫ్యూచర్లో ఈ విధానం సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామర్ల ఉపాధికి గండికొట్టొచ్చన్న భయాలూ పెరుగుతున్నాయి.