News August 6, 2024
ఒలింపిక్స్: ఆశలన్నీ అతడిపైనే
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణం ఇంకా కలగానే ఉంది. టోక్యో ఒలింపిక్స్ బంగారు పతక విజేత నీరజ్ చోప్రాపైనే దేశం మరోసారి ఆశలు పెట్టుకుంది. ఇవాళ జావెలిన్ త్రో క్వాలిఫయర్‌లో ఆయన బరిలో దిగుతున్నారు. దీంతో నీరజ్ సత్తా చాటాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరోవైపు మెన్స్ హాకీ సెమీఫైనల్లో ఇవాళ భారత్, జర్మనీతో తలపడనుంది. ఇవాళ్టి పూర్తి షెడ్యూల్ కోసం పైన చూడండి.
Similar News
News September 13, 2024
కౌశిక్‌ను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలి: ఎమ్మెల్యే దానం
TG: BRS MLA కౌశిక్ రెడ్డిని ఆ పార్టీ నేతలు కావాలనే రెచ్చగొడుతున్నారని ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆరోపించారు. హరీశ్ రావు కూడా దీనిని ప్రోత్సహించడం కరెక్ట్ కాదని అన్నారు. ‘కౌశిక్ రెడ్డి ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమా? పార్టీ స్టాండా? వ్యక్తిగతమైతే కౌశిక్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి’ అని మీడియాతో వ్యాఖ్యానించారు.
News September 13, 2024
UNలో భారత శాశ్వత సభ్యత్వానికి మద్దతిస్తాం: అమెరికా
UN భద్రతా మండలిలో భారత్, జర్మనీ, జపాన్ శాశ్వత సభ్యత్వాలకు తాము మద్దతిస్తామని అమెరికా పునరుద్ఘాటించింది. ఆఫ్రికా దేశాలకు తాత్కాలిక సభ్యత్వాలతో పాటు 2 శాశ్వత సభ్యత్వాల సృష్టికి తమ మద్దతు కొనసాగుతుందని UNలో US అంబాసిడర్ లిండా థామస్ పేర్కొన్నారు. ‘ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశం భారత్. మండలిలో నిజంగానే వారికి మేం మద్దతిస్తాం. వారి శాశ్వత సభ్యత్వాన్ని తిరస్కరించే పరిస్థితులే లేవు’ అని అన్నారు.
News September 13, 2024
శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం
AP: తిరుమలలో శ్రీవారి సర్వ దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. 9 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇటు టైమ్ స్లాట్ దర్శనానికి 4 గంటల సమయం పడుతుండగా, 4 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న తిరుమల శ్రీవారిని 63,544 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,942 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీకి రూ.3.37 కోట్ల ఆదాయం లభించింది.