News August 6, 2024
Olympics: అందినట్లే అంది..

పారిస్ ఒలింపిక్స్లో త్రుటిలో పతకాలు చేజారడం క్రీడాకారులతో పాటు అభిమానులకు తీవ్ర నిరాశ మిగులుస్తోంది. సూపర్ ఫామ్లో ఉన్న వారు సైతం పతక పోరులో వెనుదిరుగుతున్నారు. దాదాపు ఏడెనిమిది పతకాలు చివరి క్షణంలో దూరమయ్యాయి. అయితే ఇతర వరల్డ్ టోర్నీల్లో దుమ్ములేపుతున్న మనవాళ్లు ఒలింపిక్స్లో తడబడటానికి కారణం ఒత్తిడే అంటున్నారు క్రీడా నిపుణులు. మానసిక దృఢత్వంలో మనోళ్లను తీర్చిదిద్దితే పతకాలు పెరుగుతాయంటున్నారు.
Similar News
News December 10, 2025
సుందర్ పిచాయ్తో మంత్రి లోకేశ్ భేటీ

US పర్యటనలో ఉన్న మంత్రి లోకేశ్ గూగుల్ CEO సుందర్ పిచాయ్తో భేటీ అయ్యారు. విశాఖలో AI డేటా సెంటర్ పురోగతిపై చర్చించారు. రాష్ట్రంలో రాబోయే డ్రోన్ సిటీ ప్రాజెక్టులో డ్రోన్ అసెంబ్లీ, టెస్టింగ్ యూనిట్ను ఏర్పాటు చేయాలని లోకేశ్ కోరారు. విస్ట్రాన్ న్యూ వెబ్ కార్పొరేషన్ ద్వారా డేటా సెంటర్-సర్వర్ తయారీ ఎకోసిస్టమ్ను ప్రోత్సహించాలన్నారు. సంస్థలో వీటిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని సుందర్ పిచాయ్ తెలిపారు.
News December 10, 2025
IOCLలో 509 పోస్టులకు నోటిఫికేషన్

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (<
News December 10, 2025
దారిద్ర్య దహన గణపతి స్తోత్రం ఎందుకు పఠించాలి?

ఆర్థిక సమస్యలు, దారిద్ర్య బాధలను తొలగించుకోవడానికి ఈ స్తోత్రాన్ని పఠించాలని పండితులు సూచిస్తున్నారు. నిత్యం పఠిస్తే గణేశుని అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు చేకూరుతాయని చెబుతున్నారు. ‘తలపెట్టిన పనులు అడ్డంకులు లేకుండా పూర్తవుతాయి. ఈ మహా మహిమాన్విత స్తోత్రాన్ని 45 రోజుల పాటు క్రమం తప్పకుండా పఠిస్తే, ఆ వంశంలో పది తరాల వరకు దారిద్ర్య బాధలుండవని శాస్త్రాలు చెబుతున్నాయి’ అని అంటున్నారు.


