News August 6, 2024

Olympics: అందినట్లే అంది..

image

పారిస్ ఒలింపిక్స్‌లో త్రుటిలో పతకాలు చేజారడం క్రీడాకారులతో పాటు అభిమానులకు తీవ్ర నిరాశ మిగులుస్తోంది. సూపర్ ఫామ్‌లో ఉన్న వారు సైతం పతక పోరులో వెనుదిరుగుతున్నారు. దాదాపు ఏడెనిమిది పతకాలు చివరి క్షణంలో దూరమయ్యాయి. అయితే ఇతర వరల్డ్ టోర్నీల్లో దుమ్ములేపుతున్న మనవాళ్లు ఒలింపిక్స్‌లో తడబడటానికి కారణం ఒత్తిడే అంటున్నారు క్రీడా నిపుణులు. మానసిక దృఢత్వంలో మనోళ్లను తీర్చిదిద్దితే పతకాలు పెరుగుతాయంటున్నారు.

Similar News

News September 17, 2024

HYDలో ఇవాళ 3 కీలక ఘట్టాలు.. భారీ బందోబస్తు

image

TG: హైదరాబాద్ కేంద్రంగా ఇవాళ 3 కీలక ఘట్టాలు చోటుచేసుకోనున్నాయి. ఓ వైపు గణేశ్ శోభాయాత్ర, వేలాది విగ్రహాల నిమజ్జనం జరగనుంది. మరోవైపు పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగే ప్రజా పాలన దినోత్సవానికి సీఎం రేవంత్, పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే విమోచన దినోత్సవానికి కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్, సంజయ్, కిషన్ రెడ్డి హాజరుకానున్నారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.

News September 17, 2024

ఈ ఖరీఫ్ నుంచే వడ్లకు రూ.500 బోనస్: మంత్రి ఉత్తమ్

image

TG: సన్న వడ్లకు క్వింటాపై ₹500 బోనస్ ఈ ఖరీఫ్ నుంచే ఇవ్వనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ నిలబెట్టుకుంటుందని చెప్పారు. వరి సాధారణ రకానికి ₹2,300, ఏ-గ్రేడుకు ₹2,320 మద్దతు ధర ఉండగా, ₹500 బోనస్ కలిపి రైతులకు అందజేయనున్నారు. 18 రకాల సన్న రకం ధాన్యానికి ఈ బోనస్ వర్తించనుంది. దొడ్డు రకానికీ బోనస్ ఇవ్వాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.

News September 17, 2024

త్వరలోనే కొత్త రాజకీయ పార్టీ: మాజీ ఎంపీ GV

image

AP: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు వ్యతిరేకంగా కలిసి వచ్చే వ్యక్తులు, సంఘాలతో కలిసి త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని స్థాపించనున్నట్లు మాజీ ఎంపీ GV హర్షకుమార్ ప్రకటించారు. రిజర్వేషన్ల వర్గీకరణను వ్యతిరేకిస్తూ గుంటూరులో జరిగిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. పార్టీ నాయకుడు ఎవరనేది త్వరలో ప్రకటిస్తామని, రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు వర్గీకరణకు అనుకూలంగా ఉండడంతో కొత్త పార్టీ పెడుతున్నట్లు చెప్పారు.