News July 25, 2024
OLYMPICS: ముందే మొదలైన ఆటలు.. ఎందుకంటే?

పారిస్ ఒలింపిక్స్ షెడ్యూల్ ప్రకారం జులై 26న ప్రారంభం కావాలి. అయితే ఫుట్బాల్, ఆర్చరీ, హ్యాండ్బాల్, రగ్బీ ముందే మొదలయ్యాయి. ఓపెనింగ్ సెర్మనీకి ముందే ఈ ఆటలు మొదలవటానికి కారణాలున్నాయి. ఫుట్బాలర్లకు రికవరీ పీరియడ్ ఉండాలనే ఉద్దేశంతో మ్యాచ్లు ముందే పెడతారు. రగ్బీ, ఆర్చరీ, హ్యాండ్బాల్ వంటివి అథ్లెటిక్స్, రెజ్లింగ్తో వేదికలను పంచుకునే కారణంతో ఒకరోజు ముందే నిర్వహిస్తున్నారు. <<-se>>#Olympics2024<<>>
Similar News
News October 30, 2025
APPLY NOW: MGAHVలో ఉద్యోగాలు

మహాత్మాగాంధీ అంతర్ రాష్ట్రీయ హిందీ విశ్వవిద్యాలయం 23 ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతోంది. వీటిలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 10 వరకు అప్లై చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం https://hindivishwa.org/ వెబ్సైట్ను సంప్రదించవచ్చు.
News October 30, 2025
గుమ్మడి కాయలను ఎప్పుడు కోస్తే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి?

గుమ్మడి పంట నాటిన 75 నుంచి 80 రోజులకు గుమ్మడి తీగపై కాయలు ఏర్పడతాయి. లేత కాయలు త్వరగా చెడిపోతాయి. కాబట్టి బాగా ముదిరి, పండిన కాయలనే కోయాలి. ముదిరిన కాయలు 4 నుంచి 6 నెలల వరకు నిల్వ ఉంటాయి. కాబట్టి ఎంత దూరపు మార్కెట్కైనా సులభంగా తరలించవచ్చు. కాయల్ని తొడిమతో సహా కోసి, కొన్ని రోజుల పాటు ఆరనివ్వాలి. కోసిన కాయలను శుభ్రపరచి సైజులను బట్టి గ్రేడింగ్ చేసి మార్కెట్కు పంపాలి.
News October 30, 2025
ఈ-కేవైసీ చేయకపోతే నో సబ్సిడీ!

వంట గ్యాస్ వినియోగదారులు ఏటా MAR 31లోపు ఆధార్ బయోమెట్రిక్ ఆధారిత e-KYC చేయాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. లేదంటే PM ఉజ్వల యోజన కింద సబ్సిడీ రాదని తెలిపింది. దీంతో పెట్రోలియం కంపెనీలు డిస్ట్రిబ్యూటర్లకు టార్గెట్లు పెట్టి ఈ-కేవైసీ చేయిస్తున్నాయి. వినియోగదారులు మొబైల్ యాప్ ద్వారా కూడా బయోమెట్రిక్ ఆధార్ ధ్రువీకరణ చేసుకోవచ్చు. అందుకోసం ఇక్కడ <


