News August 4, 2024
Olympics: నీరజ్పైనే ‘బంగారు’ ఆశలు

పారిస్ ఒలింపిక్స్లో భారత అథ్లెట్ల పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఇప్పటివరకు కేవలం 3 కాంస్య పతకాలు సాధించిన IND.. మెడల్ టేబుల్లో 54వ స్థానంలో నిలిచింది. దీంతో టోక్యో ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రాపైనే భారత్ మరోసారి ఆశలు పెట్టుకుంది. ఎల్లుండి అతడు బరిలోకి దిగనున్నారు. అటు హాకీ టీమ్ కూడా సెమీస్ చేరడంతో స్వర్ణంపై ఆశలు చిగురిస్తున్నాయి.
<<-se>>#Olympics2024<<>>
Similar News
News January 24, 2026
నేటి నుంచి విశాఖ ఉత్సవ్

AP: నేటి నుంచి FEB 1వ తేదీ వరకు విశాఖ ఉత్సవ్ జరగనుంది. ‘Sea to Sky’ థీమ్తో విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో 9 రోజులు వేడుకలు జరగనున్నాయి. విశాఖ ఆర్కే బీచ్లో ప్రధాన వేదిక ఏర్పాటు చేశారు. 3 జిల్లాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, స్థానిక కళల ప్రదర్శన, హెలికాప్టర్ రైడ్, ఇతర అడ్వెంచర్ స్పోర్ట్స్, కబడ్డీ, వాలీబాల్, ఫుట్బాల్ పోటీలు నిర్వహించనున్నారు. వీటిలో 10 లక్షల మంది పాల్గొంటారని అధికారుల అంచనా.
News January 24, 2026
పిల్లల ముందు గొడవ పడితే..

ప్రస్తుతకాలంలో ఉమ్మడి కుటుంబాలు తగ్గి చిన్న కుటుంబాలు పెరిగాయి. దీంతో పిల్లలపై ఇంట్లో వాతావరణం తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు, కలహాలు, అక్రమ సంబంధాలు వంటివి ఉంటే ఆ ప్రభావంతో పిల్లలు మానసిక ఆందోళన, ఒత్తిడికి గురవుతారని fcfcoa అధ్యయనంలో వెల్లడైంది. ఇవి వారి జీవన నైపుణ్యాలను దెబ్బతీయడంతో పాటు ఎదిగే వయసులో తప్పటడుగులు వేసేందుకు కారణమవుతున్నట్లు పరిశోధకులు వెల్లడించారు.
News January 24, 2026
బిడ్డను నరబలి ఇచ్చిన తల్లికి ఉరిశిక్ష రద్దు!

TG: 2021లో సూర్యాపేట జిల్లాలో మూఢనమ్మకంతో 7 నెలల పసికందును నరబలి ఇచ్చిన కేసులో హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. నిందితురాలు బానోత్ భారతికి దిగువ కోర్టు విధించిన మరణశిక్షను రద్దు చేసింది. ఘటన సమయంలో భారతి తీవ్రమైన మానసిక అనారోగ్యంతో ఉందని, ఏం చేస్తుందో కూడా తెలియని స్థితిలో ఉన్నందున నేరం వర్తించదని స్పష్టం చేసింది. ఆమెను తక్షణమే మానసిక చికిత్స కేంద్రానికి తరలించాలని ఆదేశించింది.


