News August 1, 2024
OLYMPICS: కూల్‌గా మెడల్ కొట్టేశాడు!

పారిస్ ఒలింపిక్స్‌లో టర్కీకి చెందిన యూసుఫ్ జెక్ వ్యవహారశైలి వార్తల్లో నిలిచింది. అందరి అథ్లెట్లలాగా స్పెషలైజ్‌డ్ లెన్స్, ఐ కవర్, ఇయర్ ప్రొటెక్షన్ వంటివి ఏమీ లేకుండానే ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ పోటీల్లో ఆయన సిల్వర్ మెడల్ గెలుచుకున్నారు. సాదాసీదాగా, కూల్‌గా, జేబులో చేయిపెట్టుకుని షూటింగ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
<<-se>>#Olympics2024<<>>
Similar News
News January 23, 2026
₹11,399 కోట్లతో 6000 KM రోడ్ల అభివృద్ధి: కోమటిరెడ్డి

TG: IT, AI లైఫ్ సైన్సెస్ వంటి రంగాల్లో ఇన్వెస్ట్‌మెంట్స్ లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. గ్లోబల్ సమ్మిట్లో ₹5.75 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని HYDలో జరిగిన ‘ఏస్ టెక్ హైదరాబాద్-2026’ సదస్సులో తెలిపారు. ₹11399 కోట్లతో 6000 KM రోడ్లను అభివృద్ధి చేస్తామని చెప్పారు. బెటర్ లైఫ్, మోర్ జాబ్స్, స్ట్రాంగ్ ఎకానమీకి ట్రాన్స్‌పోర్ట్ చాలా కీలకమన్నారు.
News January 23, 2026
Q3 ఫలితాల ఎఫెక్ట్.. 4 శాతం తగ్గిన ఇండిగో షేర్

దేశీయ విమానయాన దిగ్గజం ఇండిగోకు డిసెంబరు త్రైమాసికంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లాభం ఏకంగా 78% పడిపోయి రూ.549.1 కోట్లకు పరిమితమైంది. గత ఏడాది ఇదే కాలంలో రూ.2,448.8 కోట్ల లాభం నమోదు కావడం గమనార్హం. విమాన సర్వీసుల్లో తీవ్ర అంతరాయాలు, కొత్త కార్మిక చట్టాల అమలే దీనికి కారణమని కంపెనీ తెలిపింది. Q3 ఫలితాల ప్రభావంతో ఇండిగో షేర్ మార్కెట్లో దాదాపు 4% పడిపోయింది.
News January 23, 2026
364 పోస్టులకు నోటిఫికేషన్

యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 364 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఈ, బీటెక్, డిగ్రీ(BA,BCom,BBA,LLB), డిప్లొమా, ఐటీఐ అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 1 నుంచి 28 వరకు NATS/NAPS పోర్టల్‌లో అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.uraniumcorp.in


