News August 9, 2024
OLYMPICS: పాక్ కంటే వెనుక భారత్!

పారిస్ ఒలింపిక్స్లో భారత్ 5 మెడల్స్ సాధించి పతకాల పట్టికలో 64వ స్థానంలో నిలవగా ఒకే ఒక్క పతకం గెలిచిన పాక్ మాత్రం 53వ స్థానంలో ఉంది. దీనికి ఓ కారణం ఉంది. గోల్డ్ మెడల్స్ ఆధారంగానే IOC పట్టికలో స్టాండింగ్స్ ఇస్తుంది. భారత్ ఖాతాలో ఒక్క స్వర్ణ పతకం కూడా లేకపోవడంతో పాక్ కన్నా వెనుకబడి ఉంది. 100 సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ సాధించిన దేశమైనా, ఒక్క గోల్డ్ మెడల్ గెలిచిన దేశం తర్వాతి స్థానాల్లోనే నిలుస్తుంది.
Similar News
News December 13, 2025
భార్యాభర్తల్లో బీపీ ప్రభావం ఎలా ఉంటుందంటే?

దంపతుల్లో ఏ ఒక్కరికి అధిక రక్త పోటు ఉన్నా రెండో వ్యక్తికి అది వచ్చే అవకాశముందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. హైబీపీ ఉన్న వారిని వివాహం చేసుకున్న మహిళలు ఈ వ్యాధి బారినపడటానికి 19శాతం ఎక్కువ అవకాశం ఉన్నట్లు మిచిగాన్, ఎమోరీ, కొలంబియా విశ్వవిద్యాలయాల అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. చైనా, భారత్ దేశాల్లో ఈ పరిస్థితి బలంగా, ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనంలో కనుగొన్నారు.
News December 13, 2025
ప్రసార భారతిలో కాస్ట్ ట్రైనీ పోస్టులు

<
News December 13, 2025
₹21000 CRతో యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణం: పొంగులేటి

TG: కుల, మతాలకు అతీతంగా విద్యార్థులందరికీ ఉత్తమ విద్య అందించేలా యంగ్ ఇండియా స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ‘CM విద్యకు ప్రాధాన్యమిస్తున్నారు. ₹21వేల కోట్లతో ఈ స్కూళ్ల భవనాలు నిర్మిస్తున్నాం. అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా ₹642 కోట్లతో స్కూళ్లలో సదుపాయాలు కల్పిస్తున్నాం’ అని వివరించారు. నైపుణ్యాల పెంపునకు ITIలలో ATCలను నెలకొల్పుతున్నట్లు వివరించారు.


