News August 9, 2024

OLYMPICS: పాక్ కంటే వెనుక భారత్!

image

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ 5 మెడల్స్ సాధించి పతకాల పట్టికలో 64వ స్థానంలో నిలవగా ఒకే ఒక్క పతకం గెలిచిన పాక్ మాత్రం 53వ స్థానంలో ఉంది. దీనికి ఓ కారణం ఉంది. గోల్డ్ మెడల్స్ ఆధారంగానే IOC పట్టికలో స్టాండింగ్స్ ఇస్తుంది. భారత్ ఖాతాలో ఒక్క స్వర్ణ పతకం కూడా లేకపోవడంతో పాక్ కన్నా వెనుకబడి ఉంది. 100 సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ సాధించిన దేశమైనా, ఒక్క గోల్డ్ మెడల్ గెలిచిన దేశం తర్వాతి స్థానాల్లోనే నిలుస్తుంది.

Similar News

News September 10, 2024

నేరుగా ఓటీటీలోకి శోభిత కొత్త మూవీ

image

అక్కినేని నాగచైతన్యకు కాబోయే భార్య శోభిత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘లవ్, సితార’. వందన కటారియా దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓటీటీలోకి రానుంది. ఈ నెల 27 నుంచి జీ 5లో స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.

News September 10, 2024

జననాల రేటు పెంచేందుకు కిమ్ ఏం చేశారంటే?

image

ఉత్తర కొరియాలో జననాల రేటును పెంచేందుకు ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కఠినంగా వ్యవహరిస్తున్నారు. అబార్షన్లు చేయడం చట్టవిరుద్ధమైనప్పటికీ కొందరు వైద్యులు రహస్యంగా కొనసాగిస్తున్నారు. దీంతో ఇలా చేయకుండా ఉండేందుకు వైద్యుల జీతాలను భారీ పెంచారు. కానీ కొందరు మారకపోవడంతో దొరికిన వైద్యులకు జైలు శిక్ష విధిస్తున్నారు. కాగా ఎక్కువ మంది పిల్లలున్న వారికి గృహాలు, ఆహారం అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.

News September 10, 2024

నియమాల ప్రకారమే పీఏసీ ఛైర్మన్ నియామకం: శ్రీధర్ బాబు

image

TG: పీఏసీ ఛైర్మన్ నియామకం శాసనసభ నియమాల ప్రకారమే జరిగిందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. కేటీఆర్ విమర్శల నేపథ్యంలో ఆయన మాట్లాడారు. తాను BRS ఎమ్మెల్యేనని అరికెపూడి గాంధీ చెప్పినట్లు తెలిపారు. రాజ్యాంగ స్ఫూర్తి గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్‌కు లేదని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ఆ పార్టీ నేతలు వ్యవస్థలను గౌరవించాలని హితవు పలికారు.