News July 31, 2024
ఒలింపిక్స్: ఫైనల్ చేరిన భారత ప్లేయర్

పారిస్ ఒలింపిక్స్‌లో మరో భారత ప్లేయర్ పతకానికి చేరువయ్యారు. 50 మీటర్ రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్లో స్వప్నిల్ కుసాలే ఫైనల్ చేరారు. 590 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచారు. రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు జరిగే ఫైనల్లో సత్తా చాటి టాప్-3లో నిలిస్తే భారత్ ఖాతాలో మరో పతకం చేరనుంది. కాగా 3 పొజిషన్ షూటింగ్ అంటే పడుకొని, మోకాళ్లపై కూర్చొని, నిలబడి షూట్ చేయడం.
Similar News
News July 5, 2025
54 ఏళ్ల తర్వాత..

భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రికార్డుల మోత మోగిస్తున్నారు. 54 ఏళ్ల తర్వాత ఒకే టెస్టులో డబుల్ సెంచరీ, సెంచరీ చేసిన భారత ప్లేయర్‌గా నిలిచారు. 1971లో వెస్టిండీస్‌పై సునీల్ గవాస్కర్ ఈ ఘనత సాధించారు. ఓవరాల్‌గా గిల్ తొమ్మిదో ప్లేయర్ కావడం గమనార్హం. అటు ఒకే టెస్టులో రెండు శతకాలు చేసిన 3వ భారత కెప్టెన్ అతడు. ఇక WTCలో భారత్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా రోహిత్(9) తర్వాతి స్థానంలో గిల్(8) ఉన్నారు.
News July 5, 2025
దారుణం: కత్తితో పొడిచి.. తాళి కట్టి.. సెల్ఫీ దిగి

కర్ణాటకలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. రక్తపు మడుగులో పడి ఉన్న యువతికి తాళి కట్టాడు. మైసూర్‌కు చెందిన పూర్ణిమ (36) టీచర్. అభిషేక్ ప్రేమ పేరుతో ఆమె వెంటపడేవాడు. ఇవాళ ఆమెను కత్తితో పొడిచాడు. యువతి స్పృహ తప్పి కిందపడిపోగానే మెడలో తాళి కట్టాడు. ఆపై సెల్ఫీ తీసుకుని మురిసిపోయాడు. తర్వాత అతడే ఆస్పత్రికి తరలించాడు. పరిస్థితి విషమించడంతో పారిపోయాడు. పూర్ణిమ చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలింది.
News July 5, 2025
వచ్చే జూన్ నాటికి వెలిగొండ పూర్తి చేయాలి: సీఎం

AP: 2026 జూన్ నాటికి వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి నీళ్లివ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. జలవనరుల శాఖపై సమీక్షించిన సీఎం.. ఈ నెల 15న హంద్రీనీవా మెయిన్ కెనాల్ ద్వారా జీడిపల్లి జలాశయానికి నీటిని విడుదల చేయాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రధాన రిజర్వాయర్లలో 419 టీఎంసీల మేర నీటి నిల్వలు ఉన్నాయని అధికారులు సీఎంకు వివరించారు. రానున్న రోజుల్లో కురిసే వర్షాలతో అవి మరింత పెరుగుతాయన్నారు.