News March 26, 2024

ఓం భీం బుష్.. రూ.21.75 కోట్ల కలెక్షన్లు

image

‘ఓం భీం బుష్’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది. 4 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.21.75 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. చిత్రంలో హీరో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కామెడీ టైమింగ్‌ ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తోంది. శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మించింది.

Similar News

News April 7, 2026

మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు

image

మారుతీ సుజుకి పలు మోడళ్ల కార్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. బాలెనోపై క్యాష్ బెనిఫిట్ కింద రూ.15వేల వరకు, ఎక్స్‌ఛేంజ్‌పై అదనంగా రూ.15వేల వరకు బోనస్ ఇస్తున్నట్లు తెలిపింది. ఫ్రాంక్స్‌పై నగదు బెనిఫిట్ కింద రూ.40 వేలు, అదనంగా రూ.10వేల వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్ ఇస్తున్నామంది. XL6పై రూ.45వేలు, విటారాపై రూ.50వేలు, ఇన్విక్టోపై రూ.2 లక్షల వరకు డిస్కౌంట్ పొందొచ్చని వివరించింది. APRకే ఇవి వర్తిస్తాయి.

News April 7, 2026

బుక్ చేసిన 2-3 రోజుల్లో సిలిండర్ డెలివరీ: పౌరసరఫరాల శాఖ

image

AP: రాష్ట్రంలోని రిఫైనరీల్లో ప్రస్తుతం 14వేల టన్నుల LPG నిల్వలు ఉన్నట్లు పౌరసరఫరాల శాఖ వెల్లడించింది. ఆన్‌లైన్‌లో గ్యాస్ బుక్ చేస్తే 2-3 రోజుల్లో సిలిండర్ హోమ్ డెలివరీ చేస్తారని తెలిపింది. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత లేదని స్పష్టం చేసింది. వదంతులు నమ్మి ప్యానిక్ బుకింగ్‌లు చేయవద్దని, గ్యాస్ ఏజెన్సీలకు వెళ్లొద్దని కోరింది. గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామంది.

News April 7, 2026

అమెరికాకు ఇరాన్ షరతులు ఇవే..

image

అమెరికా చేసిన సీజ్‌ఫైర్ ఒప్పందాన్ని తిరస్కరించిన ఇరాన్.. ఆ దేశానికి పలు కండీషన్లు పెట్టింది.
*కేవలం సీజ్‌ఫైర్ కాకుండా శాశ్వతంగా యుద్ధం ముగింపు
*మళ్లీ దాడి చేయబోమని గ్యారంటీ ఇవ్వాలి
*లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు ఆపాలి
*ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి
*తమ భాగస్వాములపై పూర్తిగా దాడులను నిలిపివేయాలి
*హార్ముజ్ నుంచి వెళ్లే ప్రతి ఓడకు 2 మిలియన్ డాలర్ల ఫీజు వసూలు