News October 8, 2024

రెండు చోట్లా ఆధిక్యంలో ఒమర్ అబ్దుల్లా

image

జమ్మూకశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా పోటీ చేసిన రెండు చోట్లా ఆధిక్యంలో ఉన్నారు. బుద్గాం, గందర్‌బల్ రెండు నియోజకవర్గాల్లో ఆయన పోటీ చేశారు. కాగా లీడింగ్‌పై స్పందించిన ఒమర్ ఫలితాలపై ఇప్పుడే అంచనాకు రాలేమన్నారు. పూర్తి ఫలితాలు వెల్లడయ్యాకే ప్రభుత్వ ఏర్పాటుపై అన్ని పార్టీలతో కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆయన కాంగ్రెస్ ‌కూటమితో కలిసి ఎన్నికల బరిలో నిలిచారు.

Similar News

News February 10, 2026

లేబర్ కోడ్‌లపై పోరు.. ఎల్లుండి బంద్

image

కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన <<18354721>>నాలుగు లేబర్ కోడ్‌లకు<<>> వ్యతిరేకంగా కార్మిక సంఘాలు ఈ నెల 12న దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించనున్నాయి. AP, TG సహా అన్ని రాష్ట్రాల్లోని వామపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు సమ్మెకు మద్దతు ప్రకటించాయి. ఈ లేబర్ కోడ్‌లతో ESI, PF, గ్రాట్యుటీ, పింఛన్‌లకు కార్మికులు దూరమవుతారని ఆందోళన వ్యక్తం చేశాయి. ఆ కోడ్‌లను రద్దు చేసి గతంలోని 29 చట్టాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాయి.

News February 10, 2026

‘రూ.100 కోట్లకు మేయర్ సీటు’.. కాంగ్రెస్vsబీజేపీ

image

TG: కరీంనగర్ మేయర్ స్థానంపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మేయర్ సీటు కోసం కాంగ్రెస్‌-ఎంఐఎం మధ్య రూ.100 కోట్ల డీల్ కుదిరిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. అయితే బండి వ్యాఖ్యల్లో నిజం లేదని, డీల్ నిజమైతే జైళ్లో పెట్టాలని లేకపోతే క్షమాపణ చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ చేశారు. కేంద్ర మంత్రిగా దీనిపై విచారణ జరిపించాలని పొన్నం డిమాండ్ చేశారు.

News February 10, 2026

ఉపవాస విరమణ ఎలా చేయాలంటే?

image

ఉపవాస దీక్షను ముగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దీక్ష విరమించిన వెంటనే ఒక్కసారిగా ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకోకూడదు. ఇలా చేస్తే జీర్ణ వ్యవస్థపై భారం పడుతుంది. అనారోగ్యం వస్తుంది. మొదట పలచని కొబ్బరినీరు, పాలు, పండ్ల రసాల వంటి ద్రవాహారం తీసుకోవాలి. అనంతరం తేలికగా అరిగే ఆహారాన్ని మితంగా తినాలి. క్రమంగా ఆహార పరిమాణాన్ని పెంచుతూ జీర్ణక్రియను సాధారణ స్థితికి తీసుకురావడం ఆరోగ్యానికి క్షేమకరం.