News August 22, 2024

OMG: ఆ గ్రామంలోని FDల విలువ రూ.7000 కోట్లు

image

గుజరాత్ కచ్‌లోని మధాపర్ ఆసియాలోనే అత్యంత సంపన్న గ్రామం. జనాభా 32వేలు. కానీ బ్యాంకుల్లో ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్ల విలువ ఏకంగా రూ.7000 కోట్లు. ఊర్లో 17 బ్యాంకులు ఉన్నాయంటేనే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడి 1200 కుటుంబాలు విదేశాల్లో ఉంటున్నాయి. వీరు అక్కడ డబ్బు సంపాదించి సొంతూర్లో డిపాజిట్ చేస్తున్నారు. సెంట్రల్ ఆఫ్రికాలోని కన్‌స్ట్రక్షన్ బిజినెస్‌లో వీరిదే ఆధిపత్యం. UK, US, NZ, AUSలోనూ వీరి హవా ఉంది.

Similar News

News October 14, 2025

సరైన నిద్ర లేకపోతే కంటి సమస్యలు!

image

కంటినిండా నిద్రలేకపోతే కళ్లపై ఎఫెక్ట్ పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గాఢనిద్రలో కళ్లు సహజంగా కన్నీళ్లను ఉత్పత్తి చేస్తాయని, దీనివల్ల అవి మృదువుగా ఉంటాయని అంటున్నారు. నిద్ర సరిగా లేకపోతే కళ్లు పొడిబారిపోతాయని చెబుతున్నారు. దీర్ఘకాలికంగా ఇదే కంటిన్యూ అయితే రెటీనా పనితీరు మందగించి చూపు తగ్గుతుందని వార్నింగ్ ఇస్తున్నారు. రోజుకు 6-8 గంటలు నిద్రపోవాలని సూచిస్తున్నారు.
Share it

News October 14, 2025

ఎంత సంపాదించినా డబ్బు మిగలట్లేదా?

image

చేతిలో ధనం నిలవనివారు 21 రోజుల సంకల్పాన్ని పాటించాలని పండితులు సూచిస్తున్నారు. ఫలితంగా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందంటున్నారు. ‘రోజూ ఉదయం లక్ష్మీదేవిని ప్రార్థించి, కొంత డబ్బును హుండీలో వేయండి. అనవసర ఖర్చులు చేయకూడదనే నియమం పెట్టుకోండి. సాయంత్రం వచ్చాక, ఖర్చు చేయకుండా ఆపగలిగిన డబ్బును అందులో వేయండి. ఈ ఆచరణ 21 రోజులు పాటిస్తే దైవ కృపతో ఆర్థిక సుస్థిరత సాధిస్తారు’ అని అంటున్నారు. <<-se>>#DHARMASANDEHALU<<>>

News October 14, 2025

₹212 కోట్లతో అమరావతిలో రాజ్‌భవన్

image

AP: అమరావతిలో ₹212కోట్లతో రాజ్‌భవన్ నిర్మించనున్నారు. దీనికి నిధులు, పాలన అనుమతి ఇస్తూ ప్రభుత్వం GO జారీచేసింది. గవర్నర్ రెసిడెన్స్ కాంప్లెక్స్‌గా నిర్మించే ఇందులో గవర్నర్ మాన్షన్, దర్బార్ హాల్, ఆఫీస్, 2 గెస్ట్ హౌస్‌లు, 6 సీనియర్ స్టాఫ్, 12 జూ.స్టాఫ్, 40 సపోర్టింగ్ స్టాఫ్ క్వార్టర్లు, 20 రూముల బ్యారెక్స్, 144 బ్యారెక్ అకామిడేషన్లను ఏర్పాటుచేస్తారు. కాంపౌండ్‌కు 4 వైపులా సెంట్రీ పోస్టులు ఉంటాయి.