News August 22, 2024
OMG: ఆ గ్రామంలోని FDల విలువ రూ.7000 కోట్లు
గుజరాత్ కచ్‌లోని మధాపర్ ఆసియాలోనే అత్యంత సంపన్న గ్రామం. జనాభా 32వేలు. కానీ బ్యాంకుల్లో ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్ల విలువ ఏకంగా రూ.7000 కోట్లు. ఊర్లో 17 బ్యాంకులు ఉన్నాయంటేనే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడి 1200 కుటుంబాలు విదేశాల్లో ఉంటున్నాయి. వీరు అక్కడ డబ్బు సంపాదించి సొంతూర్లో డిపాజిట్ చేస్తున్నారు. సెంట్రల్ ఆఫ్రికాలోని కన్‌స్ట్రక్షన్ బిజినెస్‌లో వీరిదే ఆధిపత్యం. UK, US, NZ, AUSలోనూ వీరి హవా ఉంది.
Similar News
News September 11, 2024
బిడ్డ ఫొటో షేర్ చేసిన ప్రణీత
నటి ప్రణీత ఇటీవల రెండో బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఆ బేబీ ఫొటోను ఆమె తాజాగా ట్విటర్‌లో షేర్ చేశారు. ‘మా బేబీ వచ్చింది. లెట్ ది అడ్వెంచర్ బిగిన్’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఫొటోలో ఆమె భర్త నితిన్ రాజు కూడా ఉన్నారు. కొవిడ్ సమయంలో పెళ్లి చేసుకున్న ఈ జంట, 2022లో తమ తొలి సంతానం ఆర్ణకు జన్మనించారు. బావ, అత్తారింటికి దారేది తదితర తెలుగు సినిమాల్లో ప్రణీత నటించారు.
News September 10, 2024
తోడేళ్ల దాడులకు ఆ వైరసే కారణం?
UP బహ్రైచ్ జిల్లాలో తోడేళ్ల దాడులు 50 గ్రామాల ప్రజలను వణికిస్తున్నాయి. వాటికి రేబిస్ లేదా కెనైన్ డిస్టెంపర్ వైరస్ సోకడమే ఇలాంటి అసాధారణ పరిస్థితికి కారణమై ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల అవి మనుషులపై భయాన్ని కోల్పోతాయని, విచ్చలవిడిగా కరుస్తాయని పేర్కొంటున్నారు. జంతు నమూనాల సమగ్ర విశ్లేషణ ద్వారానే కచ్చితమైన కారణాన్ని తెలుసుకోవచ్చని ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ చీఫ్ SP యాదవ్ తెలిపారు.
News September 10, 2024
హనీ ట్రాప్ జరిగింది.. నాపై కేసు కొట్టేయండి: ఎమ్మెల్యే పిటిషన్
AP: తనపై నమోదైన లైంగిక వేధింపుల కేసు <<14034033>>కొట్టేయాలని<<>> సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జులై, ఆగస్టులో ఘటన జరిగితే ఇంత ఆలస్యంగా మహిళ ఎందుకు ఫిర్యాదు చేశారని ప్రశ్నించారు. దీన్ని హనీట్రాప్‌గా పేర్కొన్నారు. తనను బెదిరించి అత్యాచారం చేశారని టీడీపీకి చెందిన ఓ మహిళ <<14026695>>వీడియోలు<<>> రిలీజ్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.