News March 27, 2024

ఏప్రిల్ 13న BRS భారీ బహిరంగ సభ

image

TG: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఏప్రిల్ 13న చేవెళ్లలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగే ఈ సభకు పెద్ద సంఖ్యలో ప్రజలను తరలించి విజయవంతం చేయాలని ఆయన పార్టీ నేతలను ఆదేశించారు. కాగా చేవెళ్ల బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్‌లో చేరడంతో ఆ పార్టీ నుంచి కాసాని జ్ఞానేశ్వర్‌ బరిలో నిలిచారు.

Similar News

News January 22, 2026

HYDలో ‘స్విస్ మాల్’ పెట్టండి: CM రేవంత్

image

స్విట్జర్లాండ్‌లోని వాడ్ కాంటన్ CM క్రిస్టెల్ లూసియర్ బ్రోడార్డ్‌ను సీఎం రేవంత్ దావోస్‌లో కలిశారు. HYDలో ‘స్విస్ మాల్’ ఏర్పాటు ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించారు. సంస్కృతి, విద్య, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో పరస్పర సహకారంపై చర్చించారు. మహిళల ఆర్థిక సాధికారతలో స్వయం సహాయక బృందాల(SHG) పాత్రను CM వారికి వివరించారు. వాడ్ ప్రతినిధులు త్వరలో TGకు వచ్చి SHG మోడల్‌ను అధ్యయనం చేస్తామని తెలిపారు.

News January 22, 2026

ENE2లో సుశాంత్ చేయట్లేదు: తరుణ్ భాస్కర్

image

ఈ నగరానికి ఏమైంది రిపీట్(ENE2)లో సాయి సుశాంత్(కార్తిక్) చేయట్లేదని వస్తున్న వార్తలను డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కన్ఫామ్ చేశారు. ‘పర్సనల్ రీజన్స్ దృష్ట్యా సుశాంత్ యాక్ట్ చేయట్లేదని తెలిసి బాధ పడ్డాను. సుశాంత్ లేకపోవచ్చు కానీ కార్తిక్ ఉంటాడు. అదే ప్రపంచాన్ని అవే క్యారెక్టర్స్‌ని మీ ముందుకు తీసుకొస్తాం. నా కాస్ట్, క్రూని నమ్ముతున్నాను. మీరు నాపై నమ్మకం ఉంచండి కుర్రాళ్లు ఇరగదీస్తారు’ అని తెలిపారు.

News January 22, 2026

AI ప్రయోజనాలు అందరికీ అందాలి: చంద్రబాబు

image

ప్రభుత్వ సేవలను మెరుగు పరిచేందుకు AIని వినియోగిస్తున్నట్లు CM చంద్రబాబు పేర్కొన్నారు. దావోస్‌లో AIపై నిర్వహించిన సెషన్‌లో ప్రసంగించారు. ‘AI కేవలం టెక్ కంపెనీలు, సిటీలకే పరిమితం కాకుడదు. ప్రతి పౌరుడు, రైతులు, విద్యార్థులు, ఎంటర్‌పెన్యూర్స్ అందరికీ దాని బెనిఫిట్స్ దక్కాలి’ అని తెలిపారు. మరో సెషన్‌లో రాష్ట్రంలో న్యాచురల్ ఫార్మింగ్ కోసం 20లక్షల ఎకరాలు, 18లక్షల మంది రైతులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.