News November 6, 2024
ON THIS DAY: అండమాన్‌ను స్వాధీనం చేసుకున్న నేతాజీ

జపాన్ ఇంపీరియల్ ఫోర్స్ ఆక్రమణలో ఉన్న అండమాన్ నికోబార్ దీవిని 1943లో ఇదేరోజున భారత సైన్యం సుప్రీం కమాండర్ సుభాష్ చంద్రబోస్ స్వాధీనం చేసుకున్నారు. టోక్యోలో జపాన్ ప్రధానిని కలిసిన తర్వాత నవంబర్ 6, 1943న A&N దీవులను భారత్‌కు అప్పగిస్తున్నట్లు ప్రకటన వచ్చింది. అనంతరం 30 డిసెంబర్ 1943న భారత గడ్డపై తొలిసారిగా జాతీయ త్రివర్ణ పతాకాన్ని నేతాజీ ఎగురవేశారు.
Similar News
News December 23, 2025
సెంట్రల్ మెకానికల్ ఇంజినీర్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

CSIR-సెంట్రల్ మెకానికల్ ఇంజినీర్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (<
News December 23, 2025
KCR, హరీశ్కు నోటీసులు ఇవ్వనున్న సిట్?

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరగనుంది. మాజీ CM KCRతో పాటు మాజీ మంత్రి హరీశ్ రావుకు SIT నోటీసులు ఇవ్వనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. గత ప్రభుత్వంలో ముఖ్య నేతల కోసమే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణలో చెప్పారని తెలుస్తోంది. దీంతో KCR, ఇద్దరు మాజీ మంత్రులకు అసెంబ్లీ సెషన్స్ తర్వాత HYD CP సజ్జనార్ నేతృత్వంలోని SIT నోటీసులు ఇవ్వనుంది.
News December 23, 2025
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ కూడా బంగారం, వెండి ధరలు భారీగా పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.2,400 పెరిగి రూ.1,38,550కు చేరింది. రెండ్రోజుల్లోనే రూ.4,370 పెరగడం గమనార్హం. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.2,200 ఎగబాకి రూ.1,27,000 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.3,000 పెరిగి రూ.2,34,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.


