News June 14, 2024

మరోసారి ఆలియా డీప్ ఫేక్ వీడియోలు వైరల్

image

బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ డీప్ ఫేక్ వీడియోలు నెట్టింట మరోసారి వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ‘గెట్ రెడీ విత్ మీ’ వీడియోను AIతో రూపొందించి, ఇన్‌స్టాలో ‘సమీక్ష’ అనే యూజర్ అకౌంట్ నుంచి పోస్ట్ చేశారు. దీనికి ఇప్పటికే 17 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. కాగా ఈ ఏడాది మేలోనూ తన డీప్ ఫేక్ వీడియో వైరల్ కావడంపై ఆలియా ఆందోళన వ్యక్తం చేశారు.

Similar News

News February 12, 2026

చలికాలంలో చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే..

image

చలికాలంలో చర్మం నిస్తేజంగా, పొడిగా మారుతుంది. ఇలా కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. రోజుకు రెండుసార్లు మాయిశ్చరైజర్ రాయడంతో పాటు స్నానానికి గోరువెచ్చని నీరే వాడాలని చెబుతున్నారు. నిద్రపోయే ముందు నూనె, లోతైన మాయిశ్చరైజర్​లతో స్కిన్ కేర్ చేసుకోవాలి. దీనివల్ల మృదువైన చర్మాన్ని పొందొచ్చు. తగినంత నీరు తాగాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే చలికాలంలో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

News February 12, 2026

రేషన్ కార్డులపై గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

image

TG: రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతోందని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. రేషన్ కార్డులు లేని అర్హులైన వ్యక్తులు ‘మీ సేవ’ కేంద్రాల్లో ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని వివరించింది. అలాగే పాత కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చవచ్చని తెలిపింది. గత ఏడాది కాలంలో 14.40 లక్షల కొత్త కార్డులు మంజూరయ్యాయని వెల్లడించింది. కాగా 2026 JANకి మొత్తం కార్డుల సంఖ్య 1,04,35,848కు చేరాయంది.

News February 12, 2026

₹10లక్షలు చెల్లించాలి; ధోనీకి HC ఆదేశం.. కారణమిదే!

image

MS ధోనీ గతంలో వేసిన పరువు నష్టం దావా కేసును విచారించేందుకు వీడియోలను డాక్యుమెంట్లుగా మార్చేందుకు అయ్యే ఖర్చుల కోసం రూ.10లక్షలు చెల్లించాలని మద్రాస్ కోర్టు ఆదేశించింది. 2013 IPL ఫిక్సింగ్‌లో ధోనీ హస్తం ఉందని Ex IPS జి.సంపత్ కుమార్, మరికొందరు ఆరోపణలు చేశారు. దీంతో ₹100 కోట్లకు ధోనీ పరువునష్టం దావా వేశారు. 2025 ఆగస్టులో కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నేపథ్యంలోనే తాజా ఉత్తర్వులు ఇచ్చింది.