News June 14, 2024

మరోసారి ఆలియా డీప్ ఫేక్ వీడియోలు వైరల్

image

బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ డీప్ ఫేక్ వీడియోలు నెట్టింట మరోసారి వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ‘గెట్ రెడీ విత్ మీ’ వీడియోను AIతో రూపొందించి, ఇన్‌స్టాలో ‘సమీక్ష’ అనే యూజర్ అకౌంట్ నుంచి పోస్ట్ చేశారు. దీనికి ఇప్పటికే 17 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. కాగా ఈ ఏడాది మేలోనూ తన డీప్ ఫేక్ వీడియో వైరల్ కావడంపై ఆలియా ఆందోళన వ్యక్తం చేశారు.

Similar News

News September 17, 2024

నేడే కేజ్రీవాల్ రాజీనామా.. కొత్త సీఎంపై సర్వత్రా ఉత్కంఠ

image

ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ఇవాళ సాయంత్రం 4.30 గంట‌ల‌కు తన పదవికి రాజీనామా చేయనున్నారు. లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ వీకే స‌క్సేనాను క‌లిసి రాజీనామా పత్రాన్ని అందిస్తారు. దీంతో తదుపరి సీఎం ఎవరనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది. ఆప్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ కేజ్రీవాల్ నివాసంలో స‌మావేశ‌మై చర్చించింది. అతిశీ, రాఘ‌వ్ చ‌ద్దా, సౌర‌భ్ భ‌ర‌ద్వాజ్‌, కైలాశ్ గ‌హ్లోత్ CM రేసులో ముందున్నారు.

News September 17, 2024

MBBS యాజమాన్య కోటా ఆప్షన్ల ఎంపికకు నోటిఫికేషన్

image

AP: ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 2024-25కు గాను యాజమాన్య కోటా(B, C) ఎంబీబీఎస్ సీట్ల ఆప్షన్ల ఎంపికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 19 రాత్రి 9 గంటల వరకు అవకాశం ఉంటుంది. 25 కాలేజీల్లో 1,914 సీట్లుండగా, B కేటగిరీలో 1,318, C(ఎన్నారై) కేటగిరిలో 596 సీట్లు ఉన్నాయి.
వెబ్‌సైట్: <>http://drntr.uhsap.in<<>>

News September 17, 2024

ఆత్మవిశ్వాసంలో కోహ్లీకి ఎవరూ సాటిరారు: సర్ఫరాజ్ ఖాన్

image

విరాట్ కోహ్లీ యంగ్ ప్లేయర్లకు ఎప్పుడూ అండగా ఉంటూ విలువైన సూచనలు ఇస్తుంటాడని సర్ఫరాజ్ ఖాన్ ప్రశంసించారు. క్రికెట్ పట్ల ప్యాషన్, ఆత్మవిశ్వాసంలో ఆయనకెవరూ సాటిరారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. IPLలో 2015-18 మధ్య RCB తరఫున కోహ్లీ కెప్టెన్సీలో ఆడిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయనతో కలిసి టీమ్ ఇండియా డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవాలనే తన కల భవిష్యత్తులో నిజమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.