News July 25, 2024
మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
బంగారం ధరలు మరోసారి భారీగా తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రూ.1,040 తగ్గి రూ.69,820కి చేరింది. 10 గ్రా. 22 క్యారెట్ల గోల్డ్ రూ.950 తగ్గి రూ.64,000కు చేరింది. కేజీ వెండి ధర రూ.3,000 మేర తగ్గి రూ.89,000 వద్ద కొనసాగుతోంది. కేంద్రప్రభుత్వం బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీని తగ్గించడంతో ధరలు 3 రోజులుగా పడిపోతున్నాయి.
Similar News
News October 11, 2024
డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్
AP: కేంద్ర పథకం PMFMEని రాష్ట్రంలో మహిళ ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం అనుసంధానించనుంది. డ్వాక్రా సంఘాల్లో ఉంటూ ఫుడ్ ప్రాసెసింగ్ బిజినెస్ ఆసక్తి ఉన్న మహిళలకు కేవలం 6 శాతం వడ్డీకి రూ.40వేల చొప్పున రుణం మంజూరు చేయనుంది. దీన్ని రెండేళ్లలో చెల్లించాలి. ఈ ఏడాది 10వేల మందికి అమలుచేసేందుకు కసరత్తు జరుగుతోంది. కేంద్రం రూ.40 కోట్లు విడుదలకు అనుమతివ్వగా, వారం రోజుల్లోనే మహిళల ఖాతాలో డబ్బులు జమ కానున్నాయి.
News October 11, 2024
ఆ 2 నగరాల్లో పావురాలు ఎగరొద్దు: పాకిస్థాన్ ఆదేశం
ఉగ్రవాదాన్ని ఎగుమతిచేసే పాకిస్థాన్ ఇప్పుడు వేర్పాటువాదుల దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. SCO సమ్మిట్‌కు భద్రత కల్పించడం తలకు మించిన భారంగా మారింది. OCT 12 నుంచి 16 వరకు ఇస్లామాబాద్, రావల్పిండి నగరాలను షట్‌డౌన్ చేస్తోంది. ఇక్కడ పావురాలు, గాలిపటాలు ఎగరకూడదని ఆదేశించింది. అందుకని పావురాల గూళ్లను తొలగించాలని సూచించింది. దీంతో మహిళా పోలీసుల సాయంతో 38 రూఫ్‌టాప్స్‌పై గూళ్లను తీసేసింది డిపార్ట్‌మెంట్.
News October 11, 2024
1.21 కోట్ల కుటుంబాలకు ‘చంద్రన్న బీమా’
AP: రాష్ట్రంలోని 1.21 కోట్ల BPL కుటుంబాల్లోని 3.07 కోట్ల మందిని ‘చంద్రన్న బీమా’ పరిధిలోకి తీసుకొచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. 18-70 ఏళ్లలోపు వారు ప్రమాదవశాత్తు చనిపోతే ₹10 లక్షలు, సహజంగా మరణిస్తే ₹2 లక్షల మొత్తం చెల్లించేలా ఉన్నతాధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఇందుకు ఏడాదికి ₹2,800 కోట్లు అవసరమవుతుందని అంచనా. త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు తెలుస్తోంది.