News August 18, 2024

పవర్‌లోకి వచ్చాక ఎయిర్‌పోర్ట్ పేరు మారుస్తాం: KTR

image

TG: 2014లో తాము అధికారంలోకి వచ్చినప్పుడు ఎయిర్‌పోర్టు పేరు మార్చలేదని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR గుర్తు చేశారు. తాము పేరు మార్చకపోవడం కాంగ్రెస్‌కు నచ్చలేదేమోనన్న కేటీఆర్.. ఈసారి అధికారంలోకి వస్తే తప్పకుండా మారుస్తామన్నారు. రాజీవ్ గాంధీ పేరు తొలగించి తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు పేరు పెడతామన్నారు. అలాగే సెక్రటేరియట్ ముందు రాజీవ్ విగ్రహం తొలగించి తెలంగాణ తల్లి విగ్రహం పెడతామని పేర్కొన్నారు.

Similar News

News September 12, 2024

వ్యాపారం వైపే మొగ్గుచూపుతున్న Z జనరేషన్!

image

ఉద్యోగులుగా కాదు ఉద్యోగాలిచ్చే స్థాయిలో ఉండాలని Gen Z యువత కోరుకుంటోంది. 1997-2012లో జన్మించిన వారిని జనరేషన్ Z అని పిలుస్తారు. 77% మంది తామే బాస్‌లుగా ఉండాలని, సొంత వ్యాపారాలు ప్రారంభించాలని అనుకుంటున్నారని ఓ సర్వేలో తేలింది. వీరిలో 39% మంది స్మార్ట్‌ఫోన్‌ల ద్వారానే వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహించగలమని నమ్ముతున్నారు. ఆవిష్కరణ, సాంకేతికత, స్వాతంత్య్రమే భవిష్యత్తు అని ఈ తరం నిరూపిస్తోంది.

News September 12, 2024

దేశ విచ్ఛిన్న శక్తులతో చేతులు కలిపిన రాహుల్: బండి సంజయ్

image

TG: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఉగ్ర సంస్థలను సమర్థిస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులతో ఆయన చేతులు కలిపారని దుయ్యబట్టారు. ఆయన భారత్‌ను విడిచి వెళ్లాలన్నారు. కాంగ్రెస్ ఒక దేశ ద్రోహ పార్టీ అని మండిపడ్డారు. దేశంలో సిక్కుల మనుగడకు ప్రమాదం ఉందని రాహుల్ వ్యాఖ్యానించగా, ఖలిస్థానీ టెర్రరిస్ట్ గురుపత్వంత్ సింగ్ పన్నూ సమర్థించిన విషయం తెలిసిందే.

News September 12, 2024

మెటా ఏఐకి పబ్లిక్ ఫిగర్ల వాయిస్!

image

వాట్సాప్‌లో మెటా ఏఐ చాట్‌బాట్‌కు త్వరలో <<13848701>>వాయిస్ వెర్షన్<<>> రానుంది. దీనిని డిఫరెంట్ వాయిస్‌లలో అందుబాటులోకి తేనున్నట్లు వాబీటా ఇన్ఫో పేర్కొంది. మొదటగా ఇంగ్లిష్‌లో పలువురు ప్రజాదరణ పొందిన వ్యక్తుల గొంతులతో తీసుకురానున్నారని, భవిష్యత్తులో ఇతర భాషల్లోనూ అందుబాటులోకి తెస్తారని తెలిపింది. యూజర్లు తమకు నచ్చిన వాయిస్‌ను ఎంచుకుని వాడుకోవచ్చని వివరించింది.