News March 25, 2024
ఒకప్పుడు ఇంట్లో నుంచి పారిపోయి..
కంగనా రనౌత్‌ని BJP MP అభ్యర్థిగా ప్రకటించడంతో ఆమె పొలిటికల్ కెరీర్ మొదలైనట్లయింది. హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన కంగనా.. 15ఏళ్లప్పుడు ఇంటి నుంచి పారిపోయి, డ్రగ్స్‌కి బానిసయ్యారట. 2006లో ‘గ్యాంగ్‌స్టార్’తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లోనూ నటించారు. ఆమెకు 4 నేషనల్, 5 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, 3 ఇంటర్నేషనల్ అవార్డులు, 2021లో పద్మశ్రీ వచ్చాయి.
Similar News
News September 11, 2024
వారికి రూ.25,000 సాయం!
AP: విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. బాగా నీటమునిగిన ఇళ్లకు రూ.25వేలు, కొంతవరకు మునిగిన ఇళ్లకు రూ.10వేల సాయం అందించనున్నట్లు తెలుస్తోంది. ఆటోలు, ట్యాక్సీల రిపేర్లకు రూ.10వేలు, బైకులకు రూ.3వేల చొప్పున ఇచ్చే అవకాశం ఉంది. పంటలకు గతంలో ఇస్తున్న పరిహారాన్ని పెంచి ఇవ్వనున్నట్లు సమాచారం. అటు కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సాయంపై రెండు రోజుల్లో క్లారిటీ రానుంది.
News September 11, 2024
నేడు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర బృందాల రాక
తెలుగు రాష్ట్రాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇవాళ, రేపు కేంద్ర బృందాలు పర్యటించనున్నాయి. కేంద్ర హోంమంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి అనిల్ సారథ్యంలో రెండు బృందాలు APకి రానున్నాయి. ఇవాళ కృష్ణా, బాపట్ల, రేపు ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో పర్యటిస్తాయి. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ కీర్తి ప్రతాప్ సింగ్ నేతృత్వంలోని బృందం TGలోని ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో పర్యటించనుంది.
News September 11, 2024
రాష్ట్రానికి మరో 2 మెడికల్ కళాశాలలు
AP: రాష్ట్రంలో కొత్తగా రెండు మెడికల్ కళాశాలలకు అనుమతిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతుల ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిని కడప, పాడేరులో ఏర్పాటు చేయనున్నారు. కాగా గతేడాది జూన్‌లో 5 వైద్య కళాశాలలను కేంద్రం మంజూరు చేసింది. మచిలీపట్నం, నంద్యాల, రాజమండ్రి, ఏలూరు, విజయనగరంలో వీటిని ఏర్పాటు చేశారు. ఇప్పటికే అక్కడ తరగతులు కూడా జరుగుతున్నాయి.