News July 12, 2024
ఏదోరోజు నాటోలోకి ఎంటర్ అవుతాం: జెలెన్‌స్కీ

ఏదో రోజు ఉక్రెయిన్ నాటోలో సభ్యదేశమవుతుందన్న నమ్మకం తనకు ఉందని ఆ దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆశాభావం వ్యక్తం చేశారు. తాము చేస్తున్న పోరాటం ఆ దిశగానే దేశాన్ని తీసుకెళ్తోందని, నాటోలో చేరేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నామని ప్రెస్‌మీట్‌లో పేర్కొన్నారు. కాగా.. ఉక్రెయిన్‌ను నాటోలో త్వరగా చేర్చడమంటే రష్యా నుంచి అణుయుద్ధాన్ని ఆహ్వానించినట్లేనని అమెరికా, జర్మనీ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Similar News
News July 9, 2025
పవన్ కళ్యాణ్ ఓ డ్రామా ఆర్టిస్ట్: రోజా

AP Dy.CM పవన్ కళ్యాణ్ ఓ డ్రామా ఆర్టిస్ట్ అని YCP నేత రోజా ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో EVM ప్రభుత్వం నడుస్తోందని ఆమె మండిపడ్డారు. తమిళనాడులోని తిరువణ్ణామలైలో ఆమె మీడియాతో మాట్లాడారు. ‘చంద్రబాబు ఒక EVM CM. APలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా EVMను ఆరు నెలలు భద్రపరుస్తారు. కానీ APలో మాత్రం 10 రోజులకే నాశనం చేయాలంటూ జీవో జారీ చేస్తారు’ అంటూ ఆమె ఫైర్ అయ్యారు.
News July 9, 2025
ప్రేయసి IPS అవ్వాలని ప్రియుడు ఏం చేశాడంటే?

ఢిల్లీకి చెందిన రాహుల్.. హరిద్వార్ నుంచి 121 లీటర్ల గంగాజలాన్ని కావడిలో మోసుకెళ్తూ రౌత్-ముజఫర్ నగర్ కావడి మార్గంలో కనిపించాడు. ఈ మార్గంలో శివ భక్తులు గంగా జలాన్ని తీసుకెళ్తుంటారు. అయితే, అందరిలా కాకుండా ఇతడు మాత్రం తన ప్రేయసి కోసం కావడి మోశారు. తాను ఇంటర్ పాసయ్యానని, ప్రేయసి IPS అయ్యేవరకూ ఇలా నీరు తెచ్చి దేవుడికి సమర్పిస్తూనే ఉంటానని ఆయన చెబుతున్నారు. ఆ తర్వాతే ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు.
News July 9, 2025
‘మెగా 157’: పోలీసులుగా చిరు, వెంకీ?

చిరంజీవి-నయనతార కాంబోలో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ‘మెగా 157’లో తన క్యామియో ఉంటుందని <<16974411>>వెంకటేశ్<<>> చెప్పిన విషయం తెలిసిందే. అయితే అది క్యామియో కాదని.. దాదాపు గంటసేపు ఆ పాత్ర ఉంటుందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. పైగా, చిరు-వెంకీ అండర్ కవర్ పోలీసులుగా ఓ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తారని టీటౌన్‌లో ప్రచారం మొదలైంది. ఆ ఇన్వెస్టిగేషన్‌లో ఇద్దరి మధ్య మంచి కామెడీ ట్రాక్ ఉంటుందని తెలుస్తోంది.