News April 28, 2024

వడదెబ్బతో ఒకరు మృతి.. TGలో ఆరెంజ్ అలర్ట్

image

TG: రాష్ట్రంలో ఎండల తీవ్ర పెరిగిపోతోంది. సూర్యాపేటలో వడదెబ్బ తగిలి ఒకరు మృతి చెందారు. అనేక ప్రాంతాల్లో 45డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో 9 జిల్లాల్లో వాతావరణ శాఖ ఈరోజు, రేపు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ములుగు, నాగర్‌కర్నూల్, నల్గొండ, నారాయణ‌పేట, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట, వరంగల్ జిల్లాలు ఇందులో ఉన్నాయి.

Similar News

News January 3, 2025

అమృత్‌పాల్ సింగ్ కొత్త పార్టీ?

image

ఖలిస్థానీ వేర్పాటువాది, ఎంపీ అమృత్‌పాల్ సింగ్ కొత్త పార్టీ పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 14న పంజాబ్‌లోని శ్రీ ముక్త్ సర్ సాహిబ్ జిల్లాలో జరిగే ఓ కార్యక్రమంలో పార్టీ పేరును అధికారికంగా ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి. కాగా అజ్‌నాలా పీఎస్‌పై దాడి కేసులో అరెస్టైన అమృత్ పాల్ సింగ్ దిబ్రూగఢ్ జైలులో ఉన్నారు. గత ఎన్నికల్లో జైలు నుంచే ఆయన పోటీ చేసి ఖడూర్ సాహిబ్ ఎంపీగా గెలుపొందిన విషయం తెలిసిందే.

News January 3, 2025

స్టాలిన్ సినిమా డైలాగ్‌తో మస్క్ స్టేట్‌మెంట్ సింక్ అవుతోందట!

image

స్టాలిన్ సినిమాలో నువ్వు చేయి న‌ర‌క‌డం త‌ప్పు కాదు, కానీ న‌రికిన చోటు త‌ప్పు అని చిరంజీవిని ప్రకాశ్‌రాజ్ వారిస్తారు. అలాగే లాస్ వెగాస్‌లో టెస్లా సైబ‌ర్‌ట్రక్‌ను ముష్క‌రులు పేల్చేశారు. దీంతో నిందితులు కారును త‌ప్పుగా ఎంచుకున్నార‌ని <<15044521>>మస్క్<<>> అన్నారు. అయితే నువ్వు బాంబు పేల్చ‌డం త‌ప్పు కాదు, దాని కోసం సైబ‌ర్‌ట్ర‌క్‌ను ఉప‌యోగించ‌డమే త‌ప్పు అన్న‌ట్టుగా మ‌స్క్ స్టేట్‌మెంట్ ఉందని కామెంట్లు పేలుతున్నాయి.

News January 3, 2025

సిరియా మాజీ అధ్యక్షుడిపై హత్యాయత్నం?

image

సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్-అసద్ ప్రస్తుతం రష్యాలో ఆశ్రయం పొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయనపై హత్యాయత్నం జరిగినట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం ఆయన తీవ్రంగా జబ్బు పడ్డారని, భద్రతాసిబ్బంది అత్యవసరంగా ఆస్పత్రికి తరలించారని క్రెమ్లిన్ వర్గాలు తెలిపాయి. విషప్రయోగం జరిగినట్లు వైద్యులు గుర్తించారని పేర్కొన్నాయి. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వెల్లడించాయి.