News April 28, 2024
వడదెబ్బతో ఒకరు మృతి.. TGలో ఆరెంజ్ అలర్ట్

TG: రాష్ట్రంలో ఎండల తీవ్ర పెరిగిపోతోంది. సూర్యాపేటలో వడదెబ్బ తగిలి ఒకరు మృతి చెందారు. అనేక ప్రాంతాల్లో 45డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో 9 జిల్లాల్లో వాతావరణ శాఖ ఈరోజు, రేపు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ములుగు, నాగర్‌కర్నూల్, నల్గొండ, నారాయణపేట, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట, వరంగల్ జిల్లాలు ఇందులో ఉన్నాయి.
Similar News
News April 12, 2026
‘ఇంటి గుట్టు లంకకు చేటు’.. తెలుసుకోండి!

కుటుంబ రహస్యాలను బయటపెట్టడం వల్ల సొంతవారికే తీవ్ర నష్టం కలుగుతుందని చెప్పే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తాం. రామాయణంలో విభీషణుడు లంక రక్షణ వ్యవస్థ గురించి రాముడికి చెబుతారు. అలాగే తన సోదరుడు రావణుడు, ఆయన పిల్లలు ఇంద్రజిత్తు, అతికాయుడి బలాల గురించి వివరిస్తారు. దీనివల్లే లంక నాశనమైంది. మన ఇంటి గోప్యతను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో ఈ సామెత వివరిస్తుంది.
<<-se>>#EPICSAYINGS<<>>

దేశాల వారీగా అత్యధిక ఉష్ణోగ్రతలు

*అమెరికా- 56.7 డిగ్రీలు (1913)
*ట్యునీషియా- 55 (1931)
*కువైట్- 54 (2016)
*ఇరాన్- 54 (2017)
*ఇజ్రాయెల్- 54 (1942)
*ఇరాక్- 53.9 (2016)
*పాకిస్థాన్- 53.7 (2017)
*యూఏఈ- 52.1 (2002)
*భారత్- 50.6 (2016)