News April 20, 2024
ఒక దగ్గర 100%.. మరో దగ్గర 0% ఓటింగ్
2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలి విడత పోలింగ్‌లో రెండు ప్రాంతాలు వార్తల్లో నిలిచాయి. తూర్పు నాగాలాండ్‌లోని 6 జిల్లాలు ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తూ ఎన్నికలకు దూరంగా ఉన్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో 0% ఓటింగ్ నమోదైంది. మరోవైపు అరుణాచల్ ప్రదేశ్‌లోని మాలోగామ్ పోలింగ్ కేంద్రంలో 100% ఓటింగ్ నమోదైంది. అక్కడ ఒకే ఒక్క ఓటర్ ఉండటం.. ఆమె కూడా ఓటు వేయడంతో సంపూర్ణ ఓటింగ్ సాధ్యమైంది. <<-se>>#Elections2024<<>>
Similar News
News November 19, 2024
గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడమే మా ధ్యేయం: పవన్
AP: చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాల నిర్వహణకు నిధులు ఇచ్చామని dy.CM పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇందుకోసం 15వ ఫైనాన్స్ నిధులు కేటాయించామని చెప్పారు. శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ‘గ్రామాలను స్వచ్ఛంగా ఉంచడం మా బాధ్యత. ఇందుకోసం చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాలను సమర్థంగా నిర్వహిస్తాం. ప్రతీ మండల కేంద్రంలో ఓ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.
News November 19, 2024
కృత్రిమ వర్షం కురిపించండి.. కేంద్రానికి మంత్రి రిక్వెస్ట్
ఢిల్లీలో తీవ్ర కాలుష్యం ఉందని, ఇందుకు కృత్రిమ వర్షమే ఏకైక పరిష్కారం అని ఆ రాష్ట్ర పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. ప్రధాని మోదీ జోక్యం చేసుకుని కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరారు. కృత్రిమ వర్షంపై గత 3 నెలలుగా కేంద్రానికి లేఖలు రాస్తున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. దీనిపై కేంద్ర పర్యావరణశాఖ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
News November 19, 2024
బుల్స్ బ్యాటింగ్: 1000 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. నిఫ్టీ 300, సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా ఎగిశాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపద రూ.6లక్షల కోట్లమేర పెరిగింది. గ్లోబల్ మార్కెట్ల నుంచి పాజిటివ్ సిగ్నల్స్, డాలర్ దూకుడు తగ్గడం, FIIలు తిరిగొస్తుండటమే ఇందుకు కారణాలు. బ్యాంకింగ్, మీడియా, రియాల్టి, కన్జూమర్ డ్యురబుల్స్, O&G షేర్లకు డిమాండ్ పెరిగింది. 200DEMA లెవల్ నుంచి నిఫ్టీ బౌన్స్‌బ్యాక్ అయింది.