News December 4, 2024
ఐదు జంటల్లో ఒకరికి పిల్లలు పుట్టట్లే!
మగవారు వీలైనంత త్వరగా పెళ్లిచేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రస్తుతం సంతానలేమి కేసులు భారీగా పెరుగుతున్నాయని, ప్రతి 5 జంటల్లో ఒకరికి సంతానం కలగట్లేదని తెలిపారు. టెస్టోస్టెరాన్ స్థాయులు తగ్గిపోవడమే ఇందుకు కారణమన్నారు. పెళ్లయ్యాక మంచి ఆహారం తీసుకుని తాగడం మానేయాలని సూచించారు. మహిళల్లో యాంటీ ముల్లెరియన్ హార్మోన్ తగ్గుతుండటంతో తెలియకుండానే పిల్లలు పుట్టే అవకాశాలు చేజారిపోతున్నాయని వివరించారు.
Similar News
News January 24, 2025
పుట్టిన రోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News January 24, 2025
ట్రంప్‌నకు షాక్.. జన్మత: పౌరసత్వం రద్దు నిర్ణయం నిలిపివేత
USAలో జన్మత: వచ్చే <<15211801>>పౌరసత్వాన్ని<<>> రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్‌నకు షాక్ తగిలింది. ఈ మేరకు ఆయన జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు సియాటెల్ కోర్టు జడ్డి జాన్ కఫెనర్ ప్రకటించారు. ఆ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఆర్డర్‌ను సవాల్ చేస్తూ పలు రాష్ట్రాలు కోర్టులకెక్కిన విషయం తెలిసిందే. ట్రంప్ ఆర్డర్ ప్రకారం USAకు వలస వెళ్లిన వారికి పిల్లలు పుడితే పౌరసత్వం రాదు.
News January 24, 2025
విద్యుత్ సమస్యల పరిష్కారానికి 1912: భట్టి
TG: వేసవిలో పీక్ డిమాండ్ దృష్ట్యా విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. ప్రజా భవన్లో ఎన్పీడీసీఎల్, ట్రాన్స్‌కో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. 108 తరహాలో విద్యుత్ సరఫరాలో సమస్యలపై ఫిర్యాదుకు 1912ను విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ఈ వ్యవస్థ నిర్వహణకు ప్రభుత్వం అదనపు నిధులు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు.