News September 16, 2024
ITలో ప్రతి నలుగురిలో ఒకరు తెలుగువారే: చంద్రబాబు

AP: గతంలో ITని ప్రవేశపెట్టినప్పుడు విప్లవాత్మక మార్పులు వచ్చాయని CM చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం ప్రతి నలుగురు భారత IT నిపుణుల్లో ఒకరు తెలుగు వారు ఉన్నారని చెప్పారు. అహ్మదాబాద్లో జరిగిన రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్లో CM మాట్లాడారు. ‘ప్రస్తుతం గ్రీన్ ఎనర్జీ రెవల్యూషన్ నడుస్తోంది. విద్యుత్ రంగంలో భారీ సంస్కరణలు వచ్చాయి. APలో ఉత్తమ పారిశ్రామిక విధానాలు అమలు చేస్తున్నాం’ అని పేర్కొన్నారు.
Similar News
News September 17, 2025
కాలీఫ్లవర్లో బటనింగ్ తెగులు – నివారణ

కాలీఫ్లవర్ పంటలో చిన్న చిన్న పూలు ఏర్పడటాన్ని బటనింగ్ అంటారు. ముదురు నారు నాటడం, నేలలో నత్రజని లోపం, స్వల్పకాలిక రకాలను ఆలస్యంగా నాటడం వల్ల ఈ సమస్య వస్తుంది. దీని నివారణకు 21 నుంచి 25 రోజులు గల నారుని నాటుకోవాలి. సిఫారసు చేసిన మోతాదులో నత్రజని ఎరువులను వేయాలి. స్వల్పకాలిక రకాలను సిఫారసు చేసిన సమయంలో విత్తడం వల్ల ఈ సమస్యను నివారించవచ్చని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
News September 17, 2025
నమో డ్రోన్ దీదీ పథకం గురించి తెలుసా?

మహిళా సాధికారత కోసం కేంద్రం పలు పథకాలు ప్రవేశపెట్టింది. అందులో ఒకటే <
News September 17, 2025
పాకిస్థాన్ మ్యాచులకు రిఫరీగా రిచర్డ్సన్!

ఆసియా కప్: షేక్హ్యాండ్ వివాదంలో రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ని తొలగించాలని పాకిస్థాన్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఆయన్ను ఆసియా కప్ నుంచి తొలగించకపోతే తాము UAEతో మ్యాచ్ ఆడబోమని ప్రకటించింది. ఈ నేపథ్యంలో పాక్ మ్యాచులకు పైక్రాఫ్ట్ను ICC దూరం పెట్టినట్లు తెలుస్తోంది. UAEతో మ్యాచ్కు రిఫరీగా రిచర్డ్సన్ను నియమించినట్లు PCB సభ్యుడు చెప్పారని PTI కథనం ప్రచురించింది.