News April 11, 2024
వచ్చే నెల నుంచి స్టోర్లలో ‘వన్ ప్లస్’ ఫోన్లు బంద్!

వచ్చే నెల 1 నుంచి తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌లో వన్ ప్లస్ ఫోన్లు ఆఫ్‌లైన్ స్టోర్లలో లభించకపోవచ్చు. ఆ ఫోన్ల అమ్మకాల వలన తమకు మార్జిన్లు ఉండకపోవడమే కాక, తమ సమస్యలను వన్ ప్లస్ పెడచెవిన పడుతోందని సౌత్ఇండియన్ ఆర్గనైజ్డ్ రిటైలర్స్ అసోసియేషన్ ఆరోపిస్తోంది. వాటిని అమ్మేది లేదని చెబుతూ వన్‌ప్లస్ సేల్స్ డైరెక్టర్‌కు తాజాగా లేఖ రాసింది.
Similar News
News March 25, 2025
భోజనం చేశాక ఇలా అనిపిస్తోందా?

కొందరికి భోజనం చేశాక పొట్టలో గడబిడగా ఉంటుంది. వేయించిన ఆహారం తీసుకున్నా, వేగంగా, పూర్తిగా నమలకుండా తీసుకున్నా కడుపులో ఉబ్బరం సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీనిని పట్టించుకోకపోతే ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. తిన్న వెంటనే కాకుండా 10 నిమిషాల తర్వాత వాకింగ్ చేయాలి. తిన్నాక డ్రింక్స్ తాగకూడదు. రాత్రి సమయంలో క్యాలిఫ్లవర్, క్యాబేజీ, ఉల్లి, వెల్లుల్లి, దుంపలు తీసుకోకూడదు.
News March 25, 2025
SLBC సొరంగం నుంచి మరో మృతదేహం వెలికితీత

ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో ఈరోజు ఉదయం గుర్తించిన మృతదేహాన్ని రెస్క్యూ సిబ్బంది వెలికితీశారు. నాగర్‌కర్నూల్‌లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. యూపీకి చెందిన ఇంజినీర్ మనోజ్ కుమార్‌గా గుర్తించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. మొత్తం 8మంది టన్నెల్‌లో చనిపోగా ఇప్పటి వరకు ఇద్దరి మృతదేహాల్ని వెలికితీశారు. మరో ఆరుగురి మృతదేహాల కోసం గాలింపు కొనసాగుతోంది.
News March 25, 2025
నాకు హోంమంత్రి పదవి అంటే ఇష్టం: రాజగోపాల్ రెడ్డి

TG: మంత్రి పదవిపై మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మీడియాతో చిట్ చాట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి వస్తుందని, ఏ పదవి వచ్చినా సమర్థవంతంగా నిర్వర్తిస్తానని చెప్పుకొచ్చారు. ఢిల్లీ నుంచి ఇంకా ఫోన్ రాలేదని తెలిపారు. ‘సామర్థ్యాన్ని బట్టి మంత్రులను ఎంపిక చేయాలి. భువనగిరి ఎంపీ ఎన్నికల బాధ్యతలు సమర్థంగా నిర్వహించా. నాకు హోంమంత్రి పదవి అంటే ఇష్టం’ అని పేర్కొన్నారు.