News June 2, 2024
ఘోర విషాదానికి ఏడాది.. ఇవాళ మరో రైలు ప్రమాదం
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగి నేటితో ఏడాది పూర్తయ్యింది. 2023 జూన్ 2న రాత్రి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టి పట్టాలు తప్పింది. మరో ట్రాక్‌పై పడిన బోగీలను యశ్వంత్‌పూర్-హౌరా ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. ఈ ఘటనలో దాదాపు 275 మంది మరణించగా, వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. కాగా ఇవాళ పంజాబ్‌లో గూడ్సు రైలు పట్టాలు తప్పి ప్యాసింజర్ రైలును <<13360515>>ఢీకొట్టడం<<>> గమనార్హం.
Similar News
News September 19, 2024
పాక్ హాకీ ఆటగాళ్లకు రూ.8,366ల బహుమతి
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో మూడో స్థానంలో నిలిచి బ్రాంజ్ మెడల్ సాధించిన పాక్ హాకీ టీమ్‌కు ఆ దేశ హాకీ ఫెడరేషన్ బహుమతి ప్రకటించింది. ఆటగాళ్లు, సిబ్బందికి 100 డాలర్ల(రూ.8,366) చొప్పున ప్రైజ్ మనీ ఇస్తామని తెలిపింది. ఇంత తక్కువ ఇవ్వడం దారుణమని, అసలు ఇవ్వకపోయి ఉంటే బాగుండేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సెమీస్‌లో చైనా చేతిలో ఓడిన పాక్.. కాంస్య పతక పోరులో కొరియాపై 5-2 తేడాతో గెలిచిన విషయం తెలిసిందే.
News September 19, 2024
వేమన నీతి పద్యం- తాత్పర్యం
కర్మ మధికమైన గడచి పోవగరాదు
ధర్మరాజు దెచ్చి తగని చోట
గంకుభట్టు జేసెగటకటా దైవంబు
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: కర్మ ఎవరినీ వదిలిపెట్టదు. ప్రతికూల సమయం వచ్చినప్పుడు ధర్మరాజు కూడా విరాట రాజువద్ద కంకుభట్టు వేషాన్ని ధరించాల్సి వచ్చింది.
News September 19, 2024
ఈ ఫొటోలోని క్రికెటర్‌ను గుర్తు పట్టారా?
ఈ ఫొటోలో భారత క్రికెట్ గేమ్ ఛేంజర్ ఉన్నారు. ఆడిన తొలి రెండు టెస్టుల్లోనూ సెంచరీలు బాదారు. వన్డేల్లో 10 వేలకుపైగా పరుగులు, 100కుపైగా వికెట్లు, 100కుపైగా క్యాచ్‌లు పట్టారు. ఆయన నాయకత్వంలో వన్డే వరల్డ్ కప్ త్రుటిలో చేజారింది. 100కు పైగా టెస్టులు, 300కు పైగా వన్డేలు ఆడారు. ఐపీఎల్‌లో PWI, KKRకు ప్రాతినిథ్యం వహించారు. ఆయన ఎవరో గుర్తు పట్టి కామెంట్ చేయండి.