News December 3, 2024
కొనసాగుతున్న క్యాబినెట్ సమావేశం
AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం కొనసాగుతోంది. ఐటీ, ఏపీ టెక్స్‌టైల్, మారిటైమ్, టూరిజం, స్పోర్ట్స్ పాలసీలతో పాటు ఆయుర్వేద, హోమియోపతి మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ చట్టసవరణ బిల్లు, CRDA నిర్ణయాలు, రేషన్ బియ్యం అక్రమ రవాణా సహా పలు అంశాలపై చర్చించనున్నారు.
Similar News
News January 18, 2025
కెప్టెన్సీ రేసు నుంచి హార్దిక్ పాండ్య ఔట్!
రోహిత్ శర్మ తర్వాత వన్డే, టీ20 జట్లకు హార్దిక్ పాండ్యకే నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తారని ఒక దశలో విపరీతంగా వార్తలు వచ్చాయి. అయితే తరచూ గాయాల పాలవుతుండటం, నిలకడలేమితో బీసీసీఐ అతడిని పరిగణనలోకి తీసుకోవట్లేదు. భవిష్యత్తులోనూ అతని కెప్టెన్సీ కల కల్లగానే మిగిలిపోనుందని విశ్లేషకుల అంచనా. టీ20లకు సూర్య(కెప్టెన్), అక్షర్(VC)కు అవకాశం ఇవ్వగా, వన్డేల్లో రోహిత్‌కు డిప్యూటీగా గిల్‌ను ప్రమోట్ చేస్తోంది.
News January 18, 2025
తెలంగాణకు మరో భారీ పెట్టుబడి
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు STT గ్లోబల్ డేటా సెంటర్ సంసిద్ధత వ్యక్తం చేసిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఆ సంస్థ రూ.3500 కోట్లతో మీర్‌ఖాన్‌పేట్‌లో ఆర్ట్ డేటా సెంటర్ నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకుందని వెల్లడించారు. సింగపూర్ పర్యటన సందర్భంగా ఈ ఎంవోయూ చేసుకున్నట్లు చెప్పారు. కాగా ఈ సంస్థకు హైటెక్ సిటీలో ఇప్పటికే ఓ ఆఫీస్ ఉంది.
News January 18, 2025
సైఫ్‌పై దాడి.. నిందితుడి అరెస్ట్!
బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి చేసిన నిందితుడిని ఛత్తీస్‌గఢ్‌లో అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. దుర్గ్ రైల్వే స్టేషన్‌లో RPF పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న ముంబై పోలీసులు అక్కడికి బయల్దేరారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని ముంబైకి తరలించనున్నారు. షాలీమార్ జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ జనరల్ కోచ్‌లో అతడు ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.