News June 12, 2024

ఈ ఎన్నికల్లో ‘ఉల్లి’ ఏడిపించింది: సీఎం శిండే

image

మహారాష్ట్రలో బీజేపీ-శివసేన-ఎన్సీపీ కూటమి 17 సీట్లకే పరిమితమవడానికి వ్యవసాయ గడ్డు పరిస్థితులే కారణమని సీఎం ఏక్‌నాథ్ శిండే వెల్లడించారు. నాసిక్ ప్రాంతంలో ఉల్లికి మద్దతు ధర దక్కకపోవడంతో సమస్యలు ఎదుర్కొన్నామని, అవి తమను ఏడిపించాయని చెప్పారు. మరాఠ్వాడాలో సోయాబీన్, విదర్భలో పత్తి పంటలు దెబ్బతీశాయన్నారు. కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌ను కలిసి పంటలకు మద్దతు ధరపై చర్చిస్తానని తెలిపారు.

Similar News

News September 12, 2025

ఆసియా కప్‌: హాంకాంగ్‌‌పై బంగ్లాదేశ్ విజయం

image

ఆసియా కప్‌లో హాంకాంగ్‌తో మ్యాచులో బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. మొదట హాంకాంగ్ నిర్ణీత 20 ఓవర్లలో 143/7 స్కోర్ చేయగా, అనంతరం బంగ్లాదేశ్ 17.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. కెప్టెన్ లిటన్ దాస్ 59, హృదోయ్ 35 రన్స్‌తో రాణించారు. రేపు గ్రూప్-Aలో ఉన్న పాక్, ఒమన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.

News September 12, 2025

నేటి ముఖ్యాంశాలు

image

* శంషాబాద్ నుంచి చెన్నై వరకు బుల్లెట్ ట్రైన్: సీఎం రేవంత్
* నేపాల్ నుంచి స్వస్థలాలకు చేరుకున్న ఏపీ వాసులు
* ఏపీలో 12 జిల్లాలకు కొత్త కలెక్టర్ల నియామకం
* కూటమి ప్రభుత్వంపై ప్రజలు విసుగెత్తిపోయారు: సజ్జల
* ఈనెల 15 నుంచి చివరి విడత స్మార్ట్ రేషన్ కార్డులు
* గ్రూప్-1పై జుడీషియల్ కమిషన్ వేయాలి: కేటీఆర్

News September 12, 2025

బ్రహ్మోత్సవాల నిర్వహణపై అధికారులతో టీటీడీ ఈవో భేటీ

image

AP: బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో అనిల్ సింఘాల్ అధికారులకు సూచించారు. ఈ వేడుకల్లో పారిశుద్ధ్యానికి పెద్ద పీట వేయాలని చెప్పారు. రద్దీకి అనుగుణంగా పార్కింగ్ ఏర్పాటు చేయాలని, భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్నప్రసాదాలు పంపిణీ చేయాలని తెలిపారు. 3,500 మంది శ్రీవారి సేవకులను సిద్ధం చేసుకోవాలని, మెట్ల మార్గాల్లో భద్రత మరింత పటిష్ఠం చేయాలని దిశానిర్దేశం చేశారు.