News September 23, 2024
కేజీ ఉల్లి రూ.35.. సప్లైకి సిద్ధంగా 4.7 లక్షల టన్నుల బఫర్ స్టాక్
ఉల్లి ధరలకు కళ్లెమేసేందుకు బఫర్ స్టాక్‌ను కేంద్రం హోల్‌సేల్ మార్కెట్లకు సప్లై చేయనుంది. ఇప్పటికే కొన్ని సిటీల్లో NCCF, NAFED ద్వారా కిలో రూ.35కే అమ్ముతున్నట్టు ప్రకటించింది. ‘ఎగుమతి సుంకం ఎత్తేయడంతో ఉల్లి ధరలు పెరుగుతాయని ముందే అంచనా వేశాం. అందుకే మావద్ద ఉన్న 4.7 లక్షల టన్నుల బఫర్ స్టాక్‌ను సబ్సిడీతో విక్రయిస్తాం’ అని కన్జూమర్ అఫైర్స్ సెక్రటరీ నిధి అన్నారు. ప్రస్తుతం కేజీ ఉల్లి రూ.60గా ఉంది.
Similar News
News October 5, 2024
బాత్రూమ్‌లోనే గుండెపోట్లు ఎక్కువ.. ఎందుకు?
US NCBI ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 11% గుండెపోటు మరణాలు బాత్రూమ్‌లోనే జరుగుతున్నాయి. స్నానం చేసేటప్పుడు శరీర ఉష్ణోగ్రతల్లో అకస్మాత్తుగా వచ్చే మార్పుల వల్ల ఒత్తిడి ఏర్పడి రక్తప్రసరణ పెరుగుతుంది. రక్తనాళాల్లో ఏవైనా అడ్డంకులు ఉంటే గుండెపోటు వస్తుంది. మలబద్ధకం ఉన్న వారు ముక్కినప్పుడు రక్తం ఎక్కువ పీడనంతో ప్రవహిస్తుంది. అప్పుడు కూడా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుందని హృద్రోగ నిపుణులు చెబుతున్నారు.
News October 5, 2024
వాళ్లకు మాత్రమే రుణమాఫీ జరగలేదు: CM రేవంత్
TG: రూ.2లక్షలలోపు పంట రుణం తీసుకున్న రైతులందరికీ రుణమాఫీ చేశామని సీఎం రేవంత్ అన్నారు. రూ.2లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్నవారు, ఆ పై మొత్తాన్ని చెల్లిస్తే మాఫీ చేస్తామని తెలిపారు. రుణమాఫీ కాని రైతులు రోడ్లు ఎక్కడానికి బదులుగా ఆయా జిల్లాల్లోని కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లాలని సీఎం సూచించారు. ప్రతిపక్షాల మాటలు నమ్మితే ‘మన్నుపోసి అంబలి కాసిన’ పరిస్థితి వస్తుందని రేవంత్ అన్నారు.
News October 5, 2024
పేదలను ఎలా ఆదుకోవాలో సలహా ఇవ్వండి: CM
TG: మూసీ నిర్వాసితులను ఏ విధంగా ఆదుకోవాలో సలహాలు ఇవ్వాలని సీఎం రేవంత్ కోరారు. పేదలకు అన్యాయం చేయబోమని, రివర్ బెడ్, బఫర్ జోన్‌లో ఉన్న వాళ్లకు ప్రత్యామ్నాయం చూపిస్తామని స్పష్టం చేశారు. మూసీ విషయంలో రెచ్చగొట్టే వారి మాటలను ప్రజలు నమ్మవద్దని కోరారు. పేదల మంచి కోసమే తమ ప్రభుత్వం ఆలోచిస్తోందని చెప్పారు. పేదలకు న్యాయం చేసేందుకు BRS, BJPలు సూచనలు చేయాలని కోరారు.