News November 16, 2024

టెన్త్ విద్యార్థులకు ‘ఆన్‌లైన్’ కష్టాలు

image

TG: పదో తరగతి పరీక్షలకు ఆన్‌లైన్ ఫీజు చెల్లింపులో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గతేడాది వరకు టెన్త్ విద్యార్థుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తే ఫీజు చెల్లింపునకు అవకాశం ఉండేది. కానీ ఈ ఏడాది నుంచి కచ్చితంగా 6-10వ తరగతి విద్యార్థుల వివరాలు నమోదు చేయాలనే నిబంధన తీసుకొచ్చారు. దీంతో ఒక్కరి డేటాను ఎంటర్ చేయకపోయినా మిగతావారి ఫీజు చెల్లింపులో ఇబ్బంది తలెత్తుతోందని ఉపాధ్యాయులు చెబుతున్నారు.

Similar News

News December 14, 2024

BIG NEWS.. త్వరలో 6,000 ఉద్యోగాలు భర్తీ

image

TG: టీచర్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త. త్వరలోనే 6వేల టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి DSC నోటిఫికేషన్ ఇస్తామని డిప్యూటీ CM భట్టి విక్రమార్క ప్రకటించారు. ఖమ్మం జిల్లా బోనకల్ గురుకుల స్కూలులో విద్యార్థులతో కలిసి ఆయన భోజనం చేశారు. ‘గత పదేళ్లు DSC నోటిఫికేషన్ ఇవ్వకుండా BRS విద్యావ్యవస్థను నాశనం చేసింది. మేం అధికారంలోకి రాగానే 11వేల టీచర్ ఉద్యోగాలు భర్తీ చేశాం’ అని ఆయన వెల్లడించారు.

News December 14, 2024

ఇకనైనా నాణ్యమైన భోజనం పెట్టండి: KTR

image

TG: బీఆర్ఎస్ చేపట్టిన గురుకుల బాట కార్యక్రమంతోనే కాంగ్రెస్ ప్రభుత్వంలో చలనం వచ్చిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇకనైనా విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలని ఆయన ట్వీట్ చేశారు. కెమెరాల ముందు హంగామా చేయకుండా గురుకుల బిడ్డల గుండె చప్పుడు వినాలని సూచించారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో గురుకుల విద్యాలయాల్లో సీట్ల కోసం పోటీ ఉంటే కాంగ్రెస్ ఏడాది పాలనలో ఆసుపత్రిలో బెడ్ల కోసం పోటీ నెలకొందని విమర్శించారు.

News December 14, 2024

అమరావతిలో మరో రూ.20వేల కోట్లతో అభివృద్ధి: నారాయణ

image

AP: అమరావతిలో మరో ₹20వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. సీడ్ క్యాపిటల్ నుంచి జాతీయ రహదారికి అనుసంధానం అయ్యే E11, E13, E14 రోడ్లను మంత్రి పరిశీలించారు. అమరావతిలో ఇప్పటికే ₹21వేల కోట్ల పనులకు అనుమతి ఇచ్చామని, సోమవారం జరిగే CRDA అథారిటీ సమావేశంలో రూ.20వేల కోట్ల పనులపై నిర్ణయం తీసుకుంటామన్నారు. 30 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు.