News September 20, 2024

నేటి నుంచి ఆన్‌లైన్‌లో ఇసుక బుకింగ్

image

AP: ఇసుక బుకింగ్ కోసం రూపొందించిన ఏపీ శాండ్ మేనేజ్‌మెంట్ పోర్టల్ నేడు అందుబాటులోకి రానుంది. ఉ.10.30-మ.12 వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో, మ.12-సా.6 వరకు ఎవరైనా వ్యక్తిగతంగా బుకింగ్‌ చేసుకునేలా పోర్టల్‌ను రూపొందించారు. అయితే 24 గంటలూ బుకింగ్‌కు అవకాశం ఉండాలని CM చంద్రబాబు ఆదేశించడంతో అధికారులు మార్పులు చేస్తున్నారు. వాగులు, వంకల నుంచి ఇసుక తీసుకెళ్లే ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని ఆయన స్పష్టం చేశారు.

Similar News

News December 17, 2025

KPHB సాయినగర్‌లో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

image

KPHB PS పరిధిలోనీ సాయినగర్‌లోని ఇగ్నైట్ జూనియర్ కాలేజీలో 1st ఇయర్ MPC విద్యార్థి శ్రీకేతన్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజీ హాస్టల్‌లో జరిగిన ఈ దుర్ఘటనపై యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం దాచిపెట్టి మృతదేహాన్ని తరలించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కాలేజీ వద్ద విద్యార్థి సంఘాలు చేరుకుని యాజమాన్యం వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News December 17, 2025

ఎంపీలందరూ సభలో ఉండాలని కాంగ్రెస్ విప్.. జర్మనీలో రాహుల్!

image

MGNREGA పేరు మార్చే బిల్లు ఒకటీరెండు రోజుల్లో పార్లమెంటు ముందుకు రానుంది. ఈ క్రమంలో రానున్న 3 రోజులు హాజరుకావాలని పార్టీ ఎంపీలకు కాంగ్రెస్ విప్ జారీ చేసింది. కానీ ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ మాత్రం ప్రస్తుతం జర్మనీలో ఉండటం గమనార్హం. దీంతో రాహుల్ విషయంలో LoP అంటే లీడర్ ఆఫ్ పర్యటన్ అని బీజేపీ సెటైర్లు వేసింది. ఆయన నాన్ సీరియస్ పొలిటీషియన్ అని, శాశ్వతంగా వెకేషన్ మోడ్‌లో ఉంటారని విమర్శించింది.

News December 16, 2025

Photos: వనతారలో మెస్సీ పూజలు

image

‘గోట్ టూర్’లో భాగంగా ఇండియాలో పర్యటిస్తున్న అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ ఇవాళ గుజరాత్‌కు వెళ్లారు. అంబానీ ఫ్యామిలీకి చెందిన వనతారను సందర్శించారు. తన తోటి ప్లేయర్లు సురెజ్, రోడ్రిగోతో కలిసి అక్కడి ఆలయంలో పూజలు చేశారు. నుదుటిన బొట్టుతో, హారతి ఇస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వారితోపాటు అనంత్ అంబానీ, రాధిక దంపతులు ఉన్నారు.