News February 2, 2025
5 మ్యాచుల్లో 35 పరుగులే

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో భారత ప్లేయర్ సంజూ శాంసన్ పేలవ ప్రదర్శన చేశారు. ఆడిన 5 మ్యాచుల్లో 7 సగటుతో 35 పరుగులే చేశారు. ఇవాళ్టి మ్యాచులో సిక్సర్‌తో ఇన్నింగ్స్ ప్రారంభించి ఊపు మీదున్నట్లు కనిపించినా రెండో ఓవర్లోనే పుల్ షాట్ ఆడి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగారు. దీంతో శాంసన్‌కు ఇంకా ఎన్ని అవకాశాలు ఇవ్వాలని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. గైక్వాడ్ వంటి ప్లేయర్లకు ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు.
Similar News
News February 8, 2026
జీడిమామిడిలో ‘టీ దోమ’ ఉద్ధృతి.. నివారణ ఎలా?

ప్రస్తుతం జీడిమామిడి తోటల్లో ‘టీ దోమల’ ఉద్ధృతి పెరిగింది. ఇవి పంట లేత చిగుళ్లు, పూత, పూత కాడలు, చిన్న కాయలను ఆశించి రసం పీలుస్తాయి. వీటిని సకాలంలో నివారించకుంటే పంట దిగుబడి భారీగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఈ తేయాకు దోమల కట్టడికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలాగే జీడిమామిడిలో ఆకు, పూత, కాయమచ్చ తెగులు నివారణకు నిపుణుల సూచనల కోసం <<-se_10015>>పాడిపంట కేటగిరీ క్లిక్<<>> చేయండి.
News February 8, 2026
ఉత్తర తెలంగాణలో BJP vs MIM

ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో మున్సిపల్ పోరు రసవత్తరంగా మారింది. ఆ జిల్లాల్లో ఎంపీ, ఎమ్మెల్యే, సర్పంచ్ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ.. మున్సిపల్, కార్పొరేషన్లలోనూ పాగా వేయాలని భావిస్తోంది. అయితే ముస్లిం జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో MIM అభ్యర్థులు బరిలో నిలిచారు. గతంలో నిజామాబాద్‌లో 16, కరీంనగర్‌లో 15 డివిజన్లు గెలుచుకున్న MIM.. ఈసారీ మేయర్ ఎంపికలో కీలకంగా మారనుంది.
News February 8, 2026
SECLలో 66 పోస్టులు.. అప్లై చేశారా?

సౌత్ ఈస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్(<


