News March 1, 2025
మిరాకిల్ జరిగితేనే..

వర్షం కారణంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్ రద్దవ్వడంతో అఫ్గానిస్థాన్ సెమీస్ ఆశలు దాదాపు గల్లంతైనట్లే. పాయింట్ల పరంగా దక్షిణాఫ్రికా(3P)తో సమానంగా ఉండగా రేపటి మ్యాచులో ఇంగ్లండ్ చేతిలో SA భారీ తేడాతో ఓడితేనే అఫ్గాన్కు అవకాశాలు ఉంటాయి. సుమారు 200 పరుగుల తేడాతో ENG గెలవాల్సి ఉంది. ఒకవేళ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైనా SA నేరుగా సెమీస్ వెళ్లనుంది.
Similar News
News December 8, 2025
GHMCలో వార్డుల సంఖ్య రెట్టింపు

TG: GHMCలో వార్డుల సంఖ్యను 150 నుంచి 300కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. గ్రేటర్ హైదరాబాద్లో 7 కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీలను ఇటీవల విలీనం చేసిన విషయం తెలిసిందే. దీంతో వార్డుల సంఖ్య డబుల్ అయ్యింది. ఈ విస్తరణతో 2,735 చదరపు కి.మీతో దేశంలోనే అతిపెద్ద నగరంగా హైదరాబాద్ అవతరించనుంది.
News December 8, 2025
గ్లోబల్ సమ్మిట్ PHOTO GALLERY

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ తొలిరోజు ముగిసింది. ఇవాళ రూ.1.88లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. CM రేవంత్ అన్నీ తానై పర్యవేక్షణ బాధ్యతలు చూసుకుంటున్నారు. తొలిరోజు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వివిధ సంస్థలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫొటోలను పైన చూడవచ్చు.
News December 8, 2025
హనుమాన్ చాలీసా భావం – 32

రామ రసాయన తుమ్హరే పాసా|
సదా రహో రఘుపతి కే దాసా||
ఓ ఆంజనేయా! నీ దగ్గర రామ నామం అనే శక్తిమంతమైన అమృతం ఉంది. ఈ శక్తి నీకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది. అందుకే నువ్వు ఎల్లప్పుడూ రఘుపతికి నమ్మకమైన, గొప్ప దాసుడివిగా ఉండగలుగుతున్నావు. శ్రీరాముడిపై నీకున్న అనంతమైన భక్తికి, ఆ రామనామమే మూలం. ఆ రామనామ శక్తితోనే నీకు అన్నీ సాధ్యమయ్యాయి. ఆ శక్తులతోనే మమ్ము కాపాడు తండ్రీ! <<-se>>#HANUMANCHALISA<<>>


