News June 30, 2024

ధరణి దరఖాస్తులు పెండింగ్‌లో పెడితే వేటే: రెవెన్యూశాఖ

image

TG: ధరణిలో భూ సమస్యల పరిష్కారానికి సంబంధించిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 2.34 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, 2 వారాల్లో 24,778 మాత్రమే పరిష్కరించారని పలు జిల్లాల కలెక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డీవోల పనితీరుపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు. దరఖాస్తులు పెండింగ్‌లో పెడితే వేటు తప్పదని హెచ్చరించారు.

Similar News

News November 4, 2025

షెఫాలీ బౌలింగ్ మాకు బిగ్ సర్‌ప్రైజ్: లారా

image

తాము వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోవడానికి షెఫాలీ వర్మ బౌలింగ్ కూడా కారణమని SA కెప్టెన్ లారా ఒప్పుకున్నారు. ‘షెఫాలీ బౌలింగ్ మాకు బిగ్ సర్‌ప్రైజ్. WC పైనల్‌లాంటి మ్యాచుల్లో పార్ట్‌టైమ్ బౌలర్లకు వికెట్లు కోల్పోవడం కరెక్ట్ కాదు. ఆమె బంతిని నెమ్మదిగా సంధిస్తూనే రెండు వికెట్లు తీసుకుంది. ఇంక ఆమెకు వికెట్స్ ఇవ్వకూడదు అనుకుంటూ మిస్టేక్స్ చేశాం. భారత్ నిర్ణయం మమ్మల్ని ఆశ్చర్య పరిచింది’ అని లారా తెలిపారు.

News November 4, 2025

నవంబర్ 4: చరిత్రలో ఈరోజు

image

✦ 1889: పారిశ్రామికవేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు జమ్నాలాల్ బజాజ్ జననం (ఫొటోలో)
✦ 1929: గణిత, ఖగోళ, జ్యోతిష శాస్త్రవేత్త శకుంతలా దేవి జననం (ఫొటోలో)
✦ 1932: సినీ దర్శకుడు, నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్ జననం
✦ 1944: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో తొలి మహిళా ఎయిర్ మార్షల్ పద్మావతి బందోపాధ్యాయ జననం
✦ 1964: దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాసరావు జననం
✦ 1971: నటి టబు జననం

News November 4, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.