News June 30, 2024
ధరణి దరఖాస్తులు పెండింగ్‌లో పెడితే వేటే: రెవెన్యూశాఖ

TG: ధరణిలో భూ సమస్యల పరిష్కారానికి సంబంధించిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 2.34 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, 2 వారాల్లో 24,778 మాత్రమే పరిష్కరించారని పలు జిల్లాల కలెక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డీవోల పనితీరుపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు. దరఖాస్తులు పెండింగ్‌లో పెడితే వేటు తప్పదని హెచ్చరించారు.
Similar News
News February 15, 2025
కూతురిని ప్రేమించాడని..

TG: సంగారెడ్డిలో మెగ్యానాయక్ తండాలో దారుణం జరిగింది. 9వ తరగతి చదువుతున్న తన కుమార్తెను ప్రేమించాడనే నెపంతో దశరథ్ అనే వ్యక్తిని గోపాల్ హతమార్చాడు. అనంతరం నారాయణఖేడ్ పీఎస్‌లో లొంగిపోయారు. మరోవైపు దశరథ్‌కు అప్పటికే పెళ్లవ్వగా.. 4 రోజులుగా కనిపించకుండా పోయాడని భార్య ఫిర్యాదు చేసింది. తాజాగా హత్యకు గురైనట్లు తేలడంతో మృతదేహం కోసం గాలిస్తున్నారు.
News February 15, 2025
పేరెంట్స్ సెక్స్ కామెంట్స్.. యూట్యూబర్ తరఫున వాదించేది ఎవరంటే?

‘ఇండియాస్ గాట్ లాటెంట్’ షోలో <<15413969>>వివాదాస్పద వ్యాఖ్యలతో<<>> కేసు ఎదుర్కొంటున్న యూట్యూబర్ రణ్‌వీర్ అలహాబాదియ తనపై నమోదైన కేసులు కొట్టేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయన తరఫున వాదించేది మాజీ సీజేఐ డీవై చంద్రచూడ్ కొడుకు అభినవ్ చంద్రచూడ్. బాంబే హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న అభినవ్ ముంబైలోనే లా పట్టా పొందారు. హార్వర్డ్ లా స్కూల్లో LLM చదివారు.
News February 15, 2025
‘లవ్‌జిహాద్’ను అడ్డుకునే దిశగా మహారాష్ట్ర..?

‘లవ్‌జిహాద్’ పై మహారాష్ట్ర ప్రభుత్వం డీజీపీ సంజయ్‌వర్మ అధ్యక్షతన ఏడుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటుచేసింది. బలవంతపు మత మార్పిడులను అడ్డుకోవడానికి న్యాయపరంగా ఉన్న అవకాశాలు, పలు రాష్ట్రాలలో అమలవుతున్న చట్టాలను విశ్లేషించి నివేదిక ప్రభుత్వానికి ఇవ్వనుంది. త్వరలోనే ప్రభుత్వం ‘లవ్‌జిహాద్’ను నివారించేందుకు చట్టం తీసుకొస్తున్నట్లు సమాచారం. అయితే విపక్షాలు కమిటీ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నాయి.