News March 13, 2025

భారత్‌కు మాత్రమే ఆ సత్తా ఉంది: స్టార్క్

image

భారత్‌లోని క్రికెట్ నైపుణ్యంపై ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ స్టార్క్ ప్రశంసలు కురిపించారు. ‘ఒకేరోజు టెస్టు, ODI, T20 మ్యాచులు పెడితే వాటన్నింటికీ వేర్వేరు బలమైన జట్లను పంపించగల సత్తా భారత్‌కు మాత్రమే ఉంది’ అని చెప్పారు. టీమ్ఇండియా సమస్యల్ని పరిష్కరించే ఆటగాడిగా KL రాహుల్ ఉన్నారని పేర్కొన్నారు. ఓపెనింగ్, కీపింగ్, ఫీల్డింగ్, ఫినిషింగ్ ఇలా ఏ బాధ్యత ఇచ్చినా సక్రమంగా నిర్వర్తిస్తున్నారని కొనియాడారు.

Similar News

News March 25, 2025

35ఏళ్ల తర్వాత సంతానం కష్టమే!

image

కెరీర్‌ గ్రోత్ అంటూ చాలా మంది మగవాళ్లు 30ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోవట్లేదు. మరికొందరేమో సెటిల్ అయ్యాకే పిల్లలంటూ ప్లాన్ చేస్తుంటారు. అయితే, 35ఏళ్లు దాటితే వీర్యంలో శుక్రకణాల సంఖ్య తగ్గుతుందని, వాటి ఆకారం మారిపోయి కదలికలు తగ్గుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘పిల్లలు పుట్టడానికి ముఖ్యమైన టెస్టోస్టెరాన్‌‌ 35ఏళ్ల నుంచి తగ్గుతూ ఉంటుంది. దీనికి పరిష్కారంగా వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు.

News March 25, 2025

ఏప్రిల్‌లో ‘మన ఇంటికి మన మిత్ర’

image

AP: వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌పై అవ‌గాహ‌న క‌ల్పించడానికి APRలో ‘ప్ర‌తి ఇంటికి మ‌న‌మిత్ర’ కార్య‌క్ర‌మాన్ని ప్రభుత్వం నిర్వహించనుంది. అధికారులు ప్రతి ఇంటికీ వెళ్లి స్మార్ట్‌ఫోన్లలో 9552300009 నంబర్‌ను సేవ్ చేసి సేవల గురించి వివరిస్తారని IT&RTG శాఖ కార్య‌ద‌ర్శి భాస్క‌ర్ వెల్ల‌డించారు. ప్రస్తుతం 210 సేవలు అందుతున్నాయని చెప్పారు. అన్ని రకాల ధ్రువపత్రాలను వాట్సాప్‌లోనే అందిస్తామని తెలిపారు.

News March 25, 2025

ఒక్క రోజులో.. 3,03,100 ఫాలోవర్స్!

image

మొన్నటి వరకూ ముంబై బౌలర్ విఘ్నేశ్ పుతుర్ గురించి చాలా మందికి తెలియదు. కానీ, ఒక్క మ్యాచుతో ఆయన ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయారు. ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఆయనకు రెండు రోజుల క్రితం 24.9వేల మంది ఫాలోవర్లుంటే, నేడు వారి సంఖ్య 3,28,000కి చేరింది. ఆటో డ్రైవర్ కొడుకు గ్రౌండ్‌లో ఆటగాళ్లను షేక్ చేశారని కొనియాడుతున్నారు. జట్టులో ఉన్న సచిన్ కుమారుడు అర్జున్ విఘ్నేశ్‌ను చూసి నేర్చుకోవాలని సూచిస్తున్నారు.

error: Content is protected !!