News March 28, 2024

బీజేపీ తరఫున పోటీ చేసేది టీడీపీ నేతలే: సజ్జల

image

AP: చంద్రబాబు ఇచ్చే హామీలకు విలువ లేదని, ఆయన ఏది చెప్పినా అమలు చేయరని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఆయన అధికారంలోకి వస్తే పెన్షన్లు ఆగిపోతాయన్నారు. బీజేపీ తరఫున కూడా టీడీపీ నేతలే పోటీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ బస్సు యాత్రలో ఉపయోగించే ప్యాంట్రీ వెహికల్‌కు ఈసీ అనుమతి తీసుకున్నామని చెప్పారు. దీనిపై తప్పుడు ప్రచారం చేయడం దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు.

Similar News

News April 5, 2026

కార్పొరేట్ FDతో అధిక వడ్డీ.. కానీ జాగ్రత్త!

image

సాధారణ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే కార్పొరేట్ FDలు 1-2% అదనపు వడ్డీని ఆఫర్ చేస్తాయి. అయితే ఇందులో రిస్క్ అధికంగా ఉంటుంది. సదరు సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో పడితే అసలు, వడ్డీ చెల్లింపుల్లో జాప్యం లేదా ఎగవేసే ప్రమాదం ఉంది. ఎలాంటి ఇన్సూరెన్స్ ఉండదు. అందుకే పెట్టుబడి పెట్టే ముందు CRISIL, ICRA వంటి సంస్థలు ఇచ్చే క్రెడిట్ రేటింగ్స్‌ను తప్పక పరిశీలించాలి. అధిక రేటింగ్ ఉన్న సంస్థల్లో భద్రత ఎక్కువ.

News April 5, 2026

నేడు SRH మ్యాచ్.. HYDకు వర్షసూచన ఉందా?

image

IPL: హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఇవాళ SRH, LSG తలపడనున్నాయి. అయితే మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉందనే వార్తల నేపథ్యంలో HYD వాతావరణ కేంద్రం అప్డేట్ ఇచ్చింది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం లేదా రాత్రి వేళల్లో ఈదురు గాలులతో తేలికపాటి వర్షం కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది. SRH మ్యాచ్ 3.30 గంటలకు కావడంతో వర్షం పడినా పెద్దగా అంతరాయం కలగకపోవచ్చు. ఇవాళ SRH, LSGలలో ఏ జట్టు గెలుస్తుంది?

News April 5, 2026

మరో అమెరికన్ ఫ్లైట్‌ను కూల్చేసిన ఇరాన్?

image

ఇరాన్‌లో కూలిన F-15E యుద్ధ విమానంలోని రెండో పైలట్‌ను కాపాడినట్లు ట్రంప్ ప్రకటించిన గంటల్లోనే అమెరికాకు మరో షాక్ తగిలినట్లు సమాచారం. రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న మరో విమానాన్ని కూల్చినట్లు IRGC ప్రకటించింది. ఇస్ఫహాన్ సౌత్‌లో ఈ ఘటన జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని అమెరికా ఇంకా ధ్రువీకరించలేదు.