News November 12, 2024

ఇద్దరు పిల్లలు ఉంటేనే పోటీకి అర్హత: CM

image

AP: భవిష్యత్తులో యువత తగ్గుతుందని అందుకే జనాభాను పెంచాల్సిన అవసరం ఉందని CM చంద్రబాబు అన్నారు. నిన్న ఉపాధ్యాయుల అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్న ఆయన.. పాపులేషన్ మేనేజ్‌మెంట్ గురించి అందరూ మాట్లాడాలని సూచించారు. ఇద్దరు పిల్లలు లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హత అనే నిబంధన పెడుతున్నామని చెప్పారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకోకపోతే దక్షిణాది రాష్ట్రాల్లో పిల్లలు తగ్గిపోతారని వ్యాఖ్యానించారు.

Similar News

News April 19, 2026

కోతుల బెడద.. ఇంటికి రూ.500 వసూలు చేసి..

image

TG: ప్రస్తుతం ప్రతీ గ్రామాన్ని కోతుల సమస్య వేధిస్తోంది. కోతులు ఇళ్లలోకి చొరబడుతుండటం, మనుషులపై దాడులు చేస్తుండటం గ్రామస్థులను కలవరపెడుతోంది. దీని పరిష్కారం కోసం మహబూబాబాద్(D) నర్సింహులపేటలో గ్రామస్థులంతా ఏకమై చందాలు సేకరించారు. ‘కోతుల తరలింపు కార్యక్రమం’ పేరిట ఇంటికి రూ.500, ఎకరానికి రూ.500 చొప్పున వసూలు చేశారు. నిపుణుల బృందంతో కోతులను పట్టించి సుదూర ప్రాంతాలకు తరలిస్తున్నారు.

News April 19, 2026

పుష్ప-2 రికార్డు బ్రేక్ చేసిన ధురంధర్-2

image

రణ్‌వీర్ సింగ్ నటించిన ధురంధర్-2 సినిమా మరో మైలురాయిని దాటేసింది. అత్యధిక కలెక్షన్లు సాధించిన ఇండియన్ చిత్రాల జాబితాలో పుష్ప-2(₹1,742Cr)ను బీట్ చేసింది. ₹1748Cr కలెక్షన్లతో మూడో స్థానానికి చేరింది. తొలి రెండు స్థానాల్లో దంగల్(₹2,090Cr), బాహుబలి:2(₹1,788Cr) ఉన్నాయి. కాగా ఇప్పటికే ₹3,000+Cr గ్రాస్ వసూళ్లు రాబట్టిన తొలి భారతీయ ఫ్రాంచైజీగా ‘ధురంధర్’ రికార్డులకెక్కిన విషయం తెలిసిందే.

News April 19, 2026

ఏపీ విభజన వ్యాఖ్యల వివాదం.. తేజస్వీ సూర్య ఏమన్నారంటే?

image

తెలంగాణను ఉద్దేశించి లోక్‌సభలో తాను చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీయడంపై BJP MP తేజస్వీ సూర్య స్పందించారు. ‘కాంగ్రెస్ నిరక్షరాస్యుల పార్టీ. నేనేం మాట్లాడానో ఆ పార్టీ నేతలు మళ్లీ వినండి. ఆ సింపుల్ మాటలను వీలైతే అర్థం చేసుకోండి. INC లీడర్లు ఉద్దేశపూర్వకంగా, అజ్ఞానంతో నిరసన తెలుపుతున్నారు’ అని మీడియాతో వ్యాఖ్యానించారు. ఉమ్మడి APని IND, PAK తరహాలో విభజించారని తేజస్వీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.