News November 26, 2024

ONOS యువత సాధికారతకు గేమ్‌ఛేంజర్: ప్రధాని మోదీ

image

రీసెర్చ్, లెర్నింగ్, నాలెడ్జ్‌కు మన దేశాన్ని కేంద్రంగా మార్చే లక్ష్యంతో ‘వన్ నేషన్ వన్ సబ్‌స్క్రిప్షన్’(ONOS)కు క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లు PM మోదీ తెలిపారు. విద్యావ్యవస్థ, యువత సాధికారతకు ఇదొక గేమ్‌ఛేంజర్ అని ట్వీట్ చేశారు. ‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని ఉన్నత విద్యాసంస్థలకు వేలాది అంతర్జాతీయ జర్నల్స్ అందుబాటులో ఉంటాయి. ఇది 1.8 కోట్ల మంది విద్యార్థులకు ఉపయోగపడుతుంది’ అని పేర్కొన్నారు.

Similar News

News December 3, 2024

పాగల్ ‘ఫెంగల్’.. 1,500kmల ప్రభావం

image

ఫెంగల్ తుఫాను భిన్న రూపాల్లో ముప్పుతిప్పలు పెట్టింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడి ఓసారి బలహీనపడుతూ, కొన్ని గంటలకే బలపడుతూ పుదుచ్చేరి వద్ద తీరం దాటింది. దాని ప్రభావం ఏపీ, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి మీద మాత్రమే కాకుండా 1,500km దూరంలోని ఒడిశాపైనా చూపింది. 5 రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. దీని తీవ్రత ఇవాళ సాయంత్రం నుంచి తగ్గుముఖం పడుతుందని IMD వెల్లడించింది.

News December 3, 2024

కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో స్పోర్ట్స్ కోటా కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, కరాటే, వాలీబాల్, షూటింగ్ సహా 27 విభాగాల్లో జాతీయ/అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడం లేదా విజయం సాధించిన వారు అర్హులు. 18-23 ఏళ్లలోపు వయసున్న టెన్త్ పాసైన వారు DEC 30లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. నెలకు రూ.21,709-69,100 జీతం చెల్లిస్తారు. వివరాలకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News December 3, 2024

రాష్ట్రంలో 7న ఆటోల బంద్

image

TG: రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 7న ఆటోల బంద్‌కు పిలుపునిచ్చారు. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలకు పరిష్కారం చూపాలని బంద్‌తో పాటు ఇందిరాపార్క్ వద్ద బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు AITUC నేతలు తెలిపారు. నిన్న హిమాయత్‌నగర్‌లోని సత్యనారాయణ రెడ్డి భవన్‌లో ‘బంద్’ గోడపత్రికలను ఆవిష్కరించారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు అమల్లోకి వచ్చిన నాటి నుంచి పలుమార్లు ఆటో డ్రైవర్లు నిరసన తెలిపిన విషయం తెలిసిందే.