News March 17, 2024
ఒంటిపూట బడులు.. స్కూళ్లకు కీలక సూచనలు
AP: ఒంటిపూట బడులు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో స్కూళ్లకు విద్యాశాఖ పలు కీలక సూచనలు చేసింది.
* స్కూల్లో బహిరంగ ప్రదేశాలు, చెట్ల కింద తరగతులు నిర్వహించవద్దు.
* ఎండల నేపథ్యంలో తగినంత తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలి.
* మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులకు స్థానికుల సమన్వయంతో
మజ్జిగ అందించాలి.
* ఎవరైనా సన్ స్ట్రోక్‌కి గురైతే వైద్యారోగ్యశాఖ సమన్వయంతో చికిత్స అందించాలి.
Similar News
News November 5, 2024
BREAKING: మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ కన్నుమూత
AP: మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ తన స్వగ్రామం అనకాపల్లి జిల్లా పెదగోగాడలో ఇవాళ మరణించారు. 1983 నుంచి 1999 వరకు వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. NTR హయాంలో మంత్రిగా పనిచేశారు. TTD బోర్డు మెంబర్‌గా కూడా ఆయన సేవలందించారు. కాగా మంత్రిగా కొనసాగుతున్నప్పుడు కూడా ఆయన నిరాడంబర జీవితం గడిపారు. RTC బస్సుల్లోనే ఆయన ప్రయాణించేవారు.
News November 5, 2024
గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష తేదీ మారుస్తారా?
AP: జనవరి 5న జరగాల్సిన గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను అభ్యర్థుల వినతి మేరకు వాయిదా వేయడంపై అధికారులు చర్చిస్తున్నారు. DSC పరీక్షల తేదీలను అనుసరించి దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు. మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలని, డీవైఈవో పరీక్ష కటాఫ్ మార్కులు తగ్గించాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఇదే విషయంపై ఎమ్మెల్సీలు చిరంజీవి, లక్ష్మణరావు APPSC ఛైర్పర్సన్ అనురాధకు విజ్ఞప్తి చేశారు.
News November 5, 2024
డిసెంబర్ 19 నుంచి హైదరాబాద్ బుక్ ఫెయిర్
పుస్తక ప్రియులకు శుభవార్త. హైదరాబాద్ బుక్ ఫెయిర్ మళ్లీ వచ్చేస్తోంది. డిసెంబర్ 19 నుంచి 29 వరకు ఎన్టీఆర్ స్టేడియంలో బుక్ ఫెయిర్ నిర్వహించనున్నట్లు సొసైటీ ప్రకటించింది. స్టాల్స్ ఏర్పాటు చేయాలనుకునేవారు ఈనెల 15లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. గతంలో పుస్తక ప్రదర్శన మ.2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఉండేదని, ఈసారి మ.12 గంటల నుంచి రా.9 గంటల వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించింది.