News February 3, 2025
శక్తిమంతమైన టూల్‌ను తీసుకొచ్చిన ఓపెన్ ఏఐ

ఆన్‌లైన్‌లో రీసెర్చ్ చేయగల డీప్ రీసెర్చ్ అనే శక్తిమంతమైన టూల్‌ను ఓపెన్ ఏఐ తీసుకొచ్చింది. అత్యంత కష్టమైన పరిశోధనను కూడా ఈ టూల్ సమర్థంగా పూర్తి చేస్తుందని ఓపెన్ ఏఐ తెలిపింది. ‘మనిషి గంటల తరబడి చేసే పనిని డీప్ రీసెర్చ్ కేవలం నిమిషాల వ్యవధిలో చేయగలదు. ఒక ప్రాంప్ట్ ఇస్తే చాలు. నెట్టింట సమాచారాన్ని క్రోడీకరించి, విశ్లేషించి నివేదికను రిసెర్చ్ అనలిస్ట్ స్థాయిలో తయారుచేసి మీకు అందిస్తుంది’ అని పేర్కొంది.
Similar News
News January 18, 2026
ట్విస్ట్ అంటే ఇది.. BJPకి షిండే షాక్ ఇస్తారా?

BMC ఫలితాల్లో ఏ సింగిల్ పార్టీకీ మెజారిటీ లేదు. 29 సీట్లు గెలిచిన మహాయుతిలోని షిండే సేన ఇప్పుడు కింగ్‌మేకర్‌గా మారింది. దీంతో మేయర్ పీఠమే లక్ష్యంగా ఆయన తన కార్పొరేటర్లను హోటల్‌కు తరలించారు. 114 మార్కు చేరాలంటే BJPకి షిండే సపోర్ట్ తప్పనిసరి. ప్రతిపక్షాలన్నీ కలిస్తే మెజారిటీకి 8 సీట్ల దూరంలోనే ఉన్నాయి. అందుకే హార్స్ ట్రేడింగ్ జరగకుండా, మేయర్ పీఠంపై గురితో షిండే ఈ ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది.
News January 18, 2026
కేజీ చికెన్ ధర ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో చికెన్ ధరలు గత వారంతో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి. మరికొన్ని చోట్ల రూ.300పైనే కొనసాగుతున్నాయి. HYDలో కేజీ స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.300-320గా ఉంది. గుంటూరు, విశాఖలో రూ.300, నంద్యాల రూ.260-300, కామారెడ్డిలో రూ.300-310, కర్నూలులో రూ.310-320కి విక్రయిస్తున్నారు. అమలాపురంలో రూ.250 నుంచి రూ.300కి పెరిగింది. మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News January 18, 2026
మీ ఇంట్లో సూర్యుడి విగ్రహం ఉందా?

చాలామంది ఇళ్లల్లో దేవుళ్ల విగ్రహాలు ఉంటాయి. కానీ సూర్యుడి విగ్రహాన్ని మాత్రం పెట్టుకోకూడదని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే సూర్యుడు మనకు రోజూ ప్రత్యక్ష దైవంగా కనిపిస్తాడు. ఉదయాన్నే సూర్యోదయ సమయంలో ఆ భాస్కరుడిని చూస్తూ నమస్కరించుకోవడం, అర్ఘ్యం వదలడం శ్రేష్ఠం. ప్రకృతిలోనే దైవాన్ని దర్శించుకునే అవకాశం ఉన్నప్పుడు, విగ్రహ రూపం కంటే నేరుగా సూర్యుడిని ఆరాధించడమే అత్యంత శక్తివంతమైన ఫలితాలను ఇస్తుంది.


