News February 3, 2025
శక్తిమంతమైన టూల్‌ను తీసుకొచ్చిన ఓపెన్ ఏఐ

ఆన్‌లైన్‌లో రీసెర్చ్ చేయగల డీప్ రీసెర్చ్ అనే శక్తిమంతమైన టూల్‌ను ఓపెన్ ఏఐ తీసుకొచ్చింది. అత్యంత కష్టమైన పరిశోధనను కూడా ఈ టూల్ సమర్థంగా పూర్తి చేస్తుందని ఓపెన్ ఏఐ తెలిపింది. ‘మనిషి గంటల తరబడి చేసే పనిని డీప్ రీసెర్చ్ కేవలం నిమిషాల వ్యవధిలో చేయగలదు. ఒక ప్రాంప్ట్ ఇస్తే చాలు. నెట్టింట సమాచారాన్ని క్రోడీకరించి, విశ్లేషించి నివేదికను రిసెర్చ్ అనలిస్ట్ స్థాయిలో తయారుచేసి మీకు అందిస్తుంది’ అని పేర్కొంది.
Similar News
News February 14, 2026
మారనున్న ‘ఆధార్’ రూపం!

ఆధార్ కార్డు ఇకపై సరికొత్త రూపంలో రాబోతోంది. భద్రతను పెంచేందుకు కార్డుపై పేరు, చిరునామా, ఆధార్ నంబర్ వంటి వ్యక్తిగత వివరాలను తొలగించి ఫొటో & క్యూఆర్ కోడ్ మాత్రమే ముద్రించనున్నారు. దీనివల్ల సమాచారం ఇతరుల చేతికి చిక్కదని UIDAI భావిస్తోంది. వెరిఫైడ్ స్కానర్లతో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినప్పుడు మాత్రమే మీ వివరాలు కనిపిస్తాయి. సమాచార దుర్వినియోగాన్ని అరికట్టి, గోప్యతను కాపాడటమే దీని ముఖ్య ఉద్దేశం.
News February 14, 2026
రికార్డ్: T20 WC 2026లో భారీ స్కోర్

కొలంబో: T20 WCలో ఒమన్‌తో మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 20 ఓవర్లలో 235-5 స్కోర్ చేసింది. ఈ ఎడిషన్‌లో ఇప్పటివరకు నమోదైన అత్యధిక స్కోర్ ఇదే. 13 సిక్సర్లు, 21 ఫోర్లు నమోదవడం విశేషం. ఐర్లాండ్ బ్యాటర్లలో లోర్కాన్ టకర్ (51 బంతుల్లో 94*) , గారెత్ డెలానీ (56), డాక్రెల్ (9 బంతుల్లో 35)* రాణించారు. నదీమ్ వేసిన 18వ ఓవర్‌లో టకర్ 26 రన్స్ (6, 4, 4, 6, 0, 6) బాదారు. ఒమన్ టార్గెట్ 236 రన్స్.
News February 14, 2026
2026-27 బడ్జెట్: వ్యవసాయం, నీరు పారుదలకు కేటాయింపులు

AP: అన్నదాత సుఖీభవ పథకానికి రాష్ట్ర బడ్జెట్‌లో రూ.6,600 కోట్లను కేటాయించారు. రాష్ట్రీయ కృషి వికాస్ యోజనకు రూ.1,927 కోట్లు, ధరల స్థిరీకరణ నిధికి రూ.500 కోట్లు, పంటల బీమాకు రూ.250 కోట్లు, PM కృషి సించాయీ యోజనకు రూ.190 కోట్లు, మత్స్యకార సేవలో కోసం రూ.260 కోట్లు, భారీ నీటిపారుదల ప్రాజెక్టులకు రూ.9,906 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు రూ.6,105 కోట్లను కేటాయిస్తున్నట్లు ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు.


