News April 23, 2025
ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ ఫలితాలు విడుదల

AP: ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఓపెన్ SSC పరీక్షలకు 26,679 మంది హాజరవగా 10,119 మంది పాసయ్యారు. ఇంటర్‌లో 63,668 విద్యార్థులకు గాను 33,819 మంది ఉత్తీర్ణత సాధించారు. రీకౌంటింగ్ & రీవెరిఫికేషన్ కోసం ఈనెల 26 నుంచి మే 5 వరకు ఫీజు చెల్లించవచ్చు. రీకౌంటింగ్‌కు ఒక్కో సబ్జెక్టుకు ₹200, రీవెరిఫికేషన్‌కు ₹1000 చెల్లించాలి. https://apopenschool.ap.gov.in/ సైట్‌లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు
Similar News
News April 23, 2025
ఇంటర్ ఫెయిల్.. సివిల్స్ ర్యాంకర్

AP: పరీక్షల్లో ఫెయిలయ్యామంటే చాలు కొంతమంది తమ కథ ముగిసిందని చదువు ఆపేయడమో లేదా జీవితాన్నే ముగించడమో చేస్తుంటారు. అయితే తిరుపతికి చెందిన సురేశ్ మాత్రం ఇంటర్‌లో ఫెయిలయినప్పటికీ ఏమాత్రం నిరాశ చెందలేదు. తన విధిరాతను ఎదుర్కొన్నాడు. సంకల్ప దీక్షతో చదివాడు. భారతదేశంలోనే అత్యున్నత పరీక్షగా భావించే సివిల్ సర్వీస్ సాధించాడు. జాతీయ స్థాయిలో 988వ ర్యాంకు సాధించి కృషి ఉంటే అసాధ్యమేదీ లేదని నిరూపించాడు.
News April 23, 2025
స్కూళ్లకు సెలవులు షురూ

ఏడాదంతా పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులకు ఉపశమనం లభించనుంది. తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లకు ఇవాళ చివరి వర్కింగ్ డే ముగిసింది. రేపటి నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఉంటాయి. 12న స్కూళ్లు రీఓపెన్ అవుతాయి. ప్రస్తుతం ఎండలు ముదిరినందున పిల్లలు మధ్యాహ్నం వేళల్లో బయటికెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. అలాగే ఈత కోసం చెరువులు, కాల్వల వద్దకు వెళ్లినప్పుడు జాగ్రత్త వహించాలి.
News April 23, 2025
‘థాంక్యూ పాకిస్థాన్, థాంక్యూ లష్కర్-ఇ-తోయిబా’ అని పోస్ట్.. అరెస్టు

J&Kలో ఉగ్రదాడి వేళ టెర్రరిస్టు ఆర్గనైజేషన్లకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఝార్ఖండ్ మిలత్ నగర్‌కు చెందిన మహమ్మద్ నౌషద్ ‘థాంక్యూ పాకిస్థాన్, థాంక్యూ లష్కర్-ఇ-తోయిబా’ అని పోస్ట్ చేశాడు. ఇది వైరల్ కావడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఇలా పోస్ట్ చేయడం వెనుక అతడి ఉద్దేశమేంటి? ఎలాంటి లింక్స్ ఉన్నాయనేది కనుక్కుంటామని పోలీసులు తెలిపారు.