News October 1, 2024

రజినీకాంత్‌కు ఆపరేషన్!

image

సూపర్ స్టార్ రజినీకాంత్‌ తీవ్రమైన కడుపునొప్పితో ఈరోజు ఉదయం ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆయనకు అనుభవజ్ఞులైన ముగ్గురు వైద్యుల బృందం పొత్తి కడుపు కింది భాగంలో స్టెంట్స్ వేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియ విజయవంతమైనట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం రజినీకాంత్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని, మూడు రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని చెప్పాయి. ఆయన త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.

Similar News

News November 22, 2025

భారీగా తగ్గిన ఉల్లి.. పెరిగిన కూరగాయల ధరలు

image

తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి ధరలు భారీగా తగ్గుతున్నాయి. HYD మార్కెట్లలో రూ.100కే 5 కేజీల ఉల్లి విక్రయిస్తున్నారు. అటు ధర రాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే మిగతా కూరగాయల ధరలు మాత్రం ఆకాశాన్నంటుతున్నాయి. కేజీ టమాటా రూ.50-80 వరకు విక్రయిస్తున్నారు. పచ్చిమిర్చి రూ.100, బెండకాయ రూ.80, బీరకాయ రూ.80, వంకాయ రూ.110 వరకు పలుకుతున్నాయి.

News November 22, 2025

ఐబీలో ACIO పోస్టుల CBT-1 ఫలితాలు విడుదల

image

ఇంటెలిజెన్స్ బ్యూరోలో 3,717 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్(ACIO) పోస్టులకు సంబంధించి సీబీటీ-1 ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు https://www.mha.gov.in/ వెబ్‌సైట్‌లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 16 నుంచి 18 వరకు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.

News November 22, 2025

రబీ వరి.. ఇలా నాటితే అధిక దిగుబడి

image

వరిలో బెంగాలీ నాట్ల పద్ధతి మంచి ఫలితాలనిస్తోంది. బెంగాలీ కూలీలు వరి నారును వరుస పద్ధతిలో మొక్కకు మొక్కకు మధ్య 6-8 అంగుళాల దూరం ఉండేలా నాటి.. 9 వరుసలకు ఒక కాలిబాట తీస్తున్నారు. దీని వల్ల మొక్కల మధ్య గాలి, వెలుతురు బాగా తగిలి, చీడపీడల ఉద్ధృతి తగ్గి దిగుబడి పెరుగుతోంది. ఈ పద్ధతిలో ఎకరాకు 15KGల విత్తనం చాలు. కూలీల ఖర్చు కూడా తగ్గడంతో పెట్టుబడి తగ్గుతుంది. మరింత సమాచారం కోసం <<-se_10015>>పాడిపంట క్లిక్<<>> చేయండి.