News February 24, 2025

ఆపరేషన్ SLBC: రెండు ప్లాన్లు సిద్ధం చేసిన అధికారులు

image

TG: శనివారం ఉదయం SLBC సొరంగంలో చిక్కుకున్న కార్మికులు ఇంకా బయటికి రాలేదు. వారిని తీసుకొచ్చేందుకు NDRF, నేవీ ప్రయత్నిస్తున్నాయి. అయితే బురద వల్ల లోనికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్లాన్-ఎ, ప్లాన్-బి రూపొందించాయి. సొరంగానికి సమాంతరంగా మరొకటి తవ్వడం, పైనుంచి రంధ్రం చేసి లోపలికి వెళ్లడం. ఈ రెండింటిపై కసరత్తు చేస్తున్నాయి. మరోవైపు ఆ 8మంది సురక్షితంగా బయటికి రావాలని అంతా కోరుకుంటున్నారు.

Similar News

News January 7, 2026

విద్యార్థి వీసాలపై అమెరికా తీవ్ర హెచ్చరికలు

image

విద్యార్థి వీసాలపై ఇండియాలోని అమెరికా ఎంబసీ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ‘స్టూడెంట్ వీసాదారులు US చట్టాలను ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు. చట్టాలను ఉల్లంఘించారని తేలినా, అరెస్టయినా వీసా రద్దవుతుంది. US నుంచి బహిష్కరిస్తారు. భవిష్యత్తులో వీసాలకు మీరు అనర్హులుగా మారవచ్చు. రూల్స్ పాటించండి. మీ ట్రావెల్‌ను ప్రమాదంలో పడేయకండి. US వీసా ఒక ప్రత్యేక ప్రయోజనం.. హక్కు కాదు’ అని ట్వీట్ చేసింది.

News January 7, 2026

సంక్రాంతి.. స్పెషల్ బస్సుల్లో ఛార్జీల పెంపు

image

TG: సంక్రాంతికి స్పెషల్ బస్సుల్లో ఛార్జీలు పెంచినట్లు TGSRTC ప్రకటించింది. 2003లో ఇచ్చిన జీవో ప్రకారం టికెట్ ధరపై 1.5 రెట్ల వరకు సవరించామని పేర్కొంది. దీంతో రూ.100 ఉన్న టికెట్ రూ.150 కానుంది. TGతో పాటు ఇతర రాష్ట్రాలకు తిరిగే స్పెషల్ బస్సులకే ఇది వర్తించనుంది. ఈ నెల 9, 10, 12,13 తేదీలతో పాటు తిరుగు ప్రయాణ రద్దీ ఎక్కువగా ఉండే 18, 19 తేదీల్లో మాత్రమే పెరిగిన ఛార్జీలు అమల్లో ఉంటాయని RTC వివరించింది.

News January 7, 2026

మన దగ్గరా అవకాడోను సాగు చేయొచ్చు

image

‘అవకాడో’ .. బ్రెజిల్, సెంట్రల్‌ అమెరికా ప్రాంతానికి చెందిన ఈ పండు ఇప్పుడు మనదేశంలోనూ పండుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో సముద్ర తీర ప్రాంతాలు వీటి సాగుకు అనుకూలమంటున్నారు శాస్త్రవేత్తలు. ఉద్యాన పంటల్లో భాగంగా అవకాడోను సాగుచేసి లాభాలు పొందవచ్చని సూచిస్తున్నారు. విత్తనం నుంచి పెరిగిన అవకాడో చెట్ల పండ్లను ఉత్పత్తి చేయడానికి 4-6 ఏళ్లు పడుతుంది, అయితే అంటుకట్టిన మొక్కలు 1-2 ఏళ్లలో ఫలాలను ఉత్పత్తి చేస్తాయి.