News November 4, 2024

వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నాం: VSR

image

AP: వక్ఫ్ సవరణ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నట్లు YCP రాజ్యసభ పక్ష నేత విజయసాయిరెడ్డి వెల్లడించారు. ‘ముస్లిం హక్కులకు భంగం కలిగే ఈ చట్టాన్ని అంగీకరించం. అన్నివేళలా మా పార్టీ వారి కోసం పోరాడుతుంది. ఈ బిల్లును TDP అంగీకరించింది. లోక్‌సభలో డ్రామాలు ఆడుతోంది. చట్టసవరణ ద్వారా వక్ఫ్ బోర్డు భూములను స్వాధీనం చేసుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది’ అని విజయవాడలో జరిగిన వక్ఫ్‌ పరిరక్షణ మహాసభలో VSR వెల్లడించారు.

Similar News

News December 11, 2024

మంచు విష్ణు ప్రధాన అనుచరుడి అరెస్ట్

image

TG: జల్‌పల్లిలో ఉద్రిక్త పరిస్థితుల నడుమ మంచు విష్ణు ప్రధాన అనుచరుడు కిరణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మనోజ్‌పై దాడి కేసులో ఆయనను పహాడీ షరీఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజుల క్రితం తనపై దాడి జరిగిందని మనోజ్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. మరో నిందితుడు వినయ్ కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలుస్తోంది.

News December 11, 2024

రేపటి నుంచి ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్

image

తెలంగాణ సచివాలయంలో డిసెంబర్ 12 నుంచి ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ అమలు కానుంది. సచివాలయంలో పనిచేసే అన్ని శాఖల అధికారులు, సిబ్బందికి దీనిని వర్తింపజేయనున్నారు. ఔట్ సోర్సింగ్, సచివాలయం హెడ్ నుంచి వేతనాలు పొందే ప్రతి ఉద్యోగికి తప్పనిసరిగా ఫేషియల్ అటెండెన్స్ అమల్లో ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

News December 11, 2024

గీతా పారాయణంలో గిన్నిస్ రికార్డు

image

మధ్యప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన గీతా పారాయణం గిన్నిస్ రికార్డు సాధించింది. ఇవాళ గీతా జయంతి సందర్భంగా 5వేల మందికి‌పైగా భక్తులు ‘కర్మ యోగ్’ అధ్యాయాన్ని పఠించారు. ఈ గిన్నిస్ రికార్డు సాధించడంపై సీఎం మోహన్ యాదవ్ సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు రాష్ట్రంలోని గోశాలలను ప్రభుత్వమే నిర్వహించాలని ఆయన నిర్ణయించారు.