News July 3, 2024
రాజ్యసభలో విపక్షాల ఆందోళన.. వాకౌట్
రాజ్యసభలో ప్రధాని మోదీ ప్రసంగానికి విపక్ష సభ్యులు అడ్డుపడ్డారు. ఆయన మాట్లాడుతుండగా ‘ప్రధాని అబద్ధాలు ఆపాలి, నీట్‌పై చర్చ చేపట్టాలి’ అని నినాదాలు చేశారు. చివరికి వారంతా మోదీ ప్రసంగాన్ని బహిష్కరిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. కాగా నిన్న లోక్‌సభలోనూ ప్రధాని ప్రసంగం సందర్భంగా విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు.
Similar News
News December 11, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News December 11, 2024
శుభ ముహూర్తం
తేది: డిసెంబర్ 11, బుధవారం
ఏకాదశి: రా.1.09 గంటలకు
రేవతి: ఉ.11.47 గంటలకు
వర్జ్యం: ఉ.6.11 గంటలకు
దుర్ముహూర్తం: ఉ.11.38-12.23 గంటల వరకు
News December 11, 2024
నన్ను అలా పిలవొద్దు.. అభిమానులకు హీరో విజ్ఞప్తి
తమిళ స్టార్ హీరో అజిత్ తన అభిమానులకు కీలక విజ్ఞప్తి చేశారు. తనను ‘కడవులే.. అజితే’ అని పిలవడం ఇబ్బందిగా ఉందన్నారు. అలా పిలవడం ఆపేయాలని ఆయన ఫ్యాన్స్‌ను కోరారు. తన పేరు ముందు ఎలాంటి పదాలు పెట్టి పిలవొద్దన్నారు. ఈ మేరకు ఆయన టీమ్ ప్రకటన విడుదల చేసింది. కాగా ‘కడవులే’ అంటే తమిళంలో దేవుడని అర్థం.